మరికొద్ది రోజుల్లో వైసిపి కనుమరుగు: కోండ్రు

Apr 3,2024 21:45

ప్రజాశక్తి – వంగర : మరికొద్ది రోజుల్లో వైసిపి కనుమరుగవుతుందని రాజాం నియోజకవర్గం టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నీలయ్యవలస, పట్టువర్దనం, భాగంపేట శ్రీహరిపురం, శ్రీహరిపురం ఆర్‌ఆర్‌ కాలనీ గ్రామాలలో ఆయన బుధవారం పర్యటించి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు రూపకల్పన చేసిన సూపర్‌ సిక్స్‌, బీసీ డిక్లరేషన్‌లపై ప్రజలకు వివరించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బొత్స వాసుదేవరావు నాయుడు, పిన్నింటి మోహనరావు, లచ్చు బుక్త కృష్ణమూర్తి, ఉదయాన మురళీ, కృష్ణారావు, మజ్జిగ గణపతి, గంగులు తదితరులు పాల్గొన్నారు.రేగిడి: మండలంలోని సంకిలి గ్రామంలో బుధవారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రంగు కృష్ణారావు, కర్రి రమణ, నారు జనార్థనరావు, దూబ ధర్మారావు, రమేష్‌ నాయుడు, నారాయణరావు, క్రాంతికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. పింఛన్ల పై వైసిపి దుష్ప్రచారం మానుకోవాలిరాజాం: పింఛన్లపై వైసిపి దుష్ప్రచారం మానుకోవాలని మాజీ మంత్రి, రాజాం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీ మోహన్‌రావు అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన బుధవారం జనసేన, బిజెపి నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. వైసిపి ప్రభుత్వం కనీసం రాజాం రోడ్లు మరమ్మత్తులు చెయ్యలేని అసమర్ధంగా ఉందన్నారు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శులతో ఫించన్లు పంపిణీ చేయించకపో వడానికి నిధులు కొరతే కారణమన్నారు. ఎన్నికల కమిషన్‌, టిడిపిపై వైసిపి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఏప్రిల్‌ 1వ తారీఖు నుంచి ఇంటి వద్దే ఫించన్లు పంపిణీ చేయాలని సీఎం జగన్‌ ఎందుకు ఆదేశాలు జారీ చెయ్యలేక పోయారని ప్రశ్నించారు. 1.35 లక్షల సచివాలయ సిబ్బంది ద్వారా యుద్ధప్రాతిపదికన ఫించన్లు ఇంటి వద్దే పంపిణీ చేయడం రెండు గంటల్లోనే సాధ్యం అవుతుందన్నారు. అధికారులతో సచివాలయం వద్ద పింఛన్లు పంపిణీ చేయిస్తే తామే టెంట్లు, మజ్జిగ ఏర్పాటు చేస్తామన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే రూ.4వేలు పింఛను ఇంటి వద్దనే ఇస్తామన్నారు. బిజెపి నాయకులు కోటగిరి నారాయణ రావు, జనసేన నాయకులు ఉర్లాపు పోలిరాజు, గురవాన నారాయణ రావు, రఘుమండల గణపతి, పాలవలస సింహాచలం, జొన్నాడ రంజిత్‌, మిత్తి రెడ్డి మధుసూదన రావు, రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️