గురుకులాల్లో ఇంటర్‌ సీట్లు పెంచాలి

May 21,2024 23:16 #ఎస్‌ఎఫ్‌ఐ
ఎస్‌ఎఫ్‌ఐ

ఐటిడిఎ పిఒ, డిడిలకు ఎస్‌ఎఫ్‌ఐ వినతి

ప్రజాశక్తి -పాడేరు :అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలోని గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో గ్రూపుల వారీగా సీట్లు పెంచాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కార్తీక్‌, జీవన్‌కృష్ణ కోరారు. మంగళవారం ఐటిడిఎ పిఒ, గిరిజన సంక్షేమ డిడిలకు వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని బాలికల గురుకుల కళాశాల ప్రాంగణంలో ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు గిరిజన బాలురకు కౌన్సెలింగ్‌కు అటు అధికారులతో పాటు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా ఇంటర్‌లో ప్రవేశాలకు సీట్లు రాని పరిస్థితి ఉందని, దీనిపై దృష్టి సారించి, అందరికీ సీట్లు వచ్చేలా వాటి సంఖ్యను పెంచాలని పాడేరు ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌, గిరిజన సంక్షేమ డిడి కొండలరావులకు వినతిపత్రాలను అందజేశారు. 1700 మంది బాలురు దరఖాస్తు చేసుకుంటే 800 మందికి మాత్రమే సీట్లు కేటాయించడం దారుణమన్నారు. గిరిజన బాలలకు ఉన్నతవిద్యావకాశాలు అందుబాటులోకి రావాలంటే తప్పకుండా సీట్లు పెంచి వారికి న్యాయం చేయాలని కోరారు. దీనిపై ఐటిడిఎ పిఒ వి. అభిషేక్‌ స్పందిస్లూ ఇంటర్‌లో ప్రవేశానికి అందరికీ సీట్లు వచ్చేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జీవన్‌కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులు మత్స్యరాజు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

➡️