మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Jun 25,2024 20:28
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

మాట్లాడుతున్న ఎస్‌ఐమత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి ప్రజాశక్తి-కోవూరు:యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోవూరు ఎస్‌ఐ రంగనాథ్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణపై పలు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు.విద్యార్థులు అలాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలన్నారు. ప్రపంచాన్ని మాదక ద్రవ్యాల నుంచి విముక్తి చేయాలన్న ఆకాంక్షాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సహకరిం చాలన్నారు. ప్రతేడాది జూన్‌ 26న మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు .ర్యాలీలో .పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

➡️