జగన్‌ బస్సు యాత్రను జయప్రదం చేయాలి

ప్రజాశక్తి- సిఎస్‌ పురంరూరల్‌ : మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు కోరారు. మండల పరిధిలోని శీలంవారిపల్లిలోనున్న కదిరి బాబూరావు క్యాంపు కార్యాలయంలో వైసిపి కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేమంతా సిద్ధం బస్సు యాత్ర పిసిపల్లి మండలం నుంచి కనిగిరి నియోజకవర్గంలోకి ఆదివారం ప్రవేశిస్తుందన్నారు. రామాపురం, అజీజ ్‌పురం, చింతలపాలెం, కనిగిరిలోని పామూరు బస్టాండు, ఒంగోలు బస్టాండ్‌, చిన్నారి కట్ల, పెదరికట్ల మీదుగా దొనకొండ జంక్షన్‌ వరకూ బస్సు యాత్ర సాగుతుందన్నారు. అక్కడ బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతారని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వైసిపి నాయకులు , కార్యకర్తలు, వైఎస్‌ఆర్‌, జగన్‌ అభిమానులు పాల్గొని జయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జడ్‌పిటిసిల సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటక తిరుపతిరెడ్డి, నారాయణ స్వామి ట్రస్ట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ దుగ్గిరెడ్డి జయరెడ్డి, కదిరి పార్థసారథి, ముడుమాల నారాయణరెడ్డి, తోట అశోక్‌, పోలయ్య, ఎంపిపి మూడమంచు వెంకటేశ్వర్లు, సర్పంచుల సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల చిరంజీవి, వైసిపి మైనార్టీ సెల్‌ రాష్ట్ర నాయకుడు షేక్‌ బుజ్జి, డిజిపేట మాజీ ఎంపిటిసి మితికేల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️