టిడిపిలో భారీ చేరికలు

Dec 28,2023 13:56 #Vizianagaram
join in tdp vzm

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన అశోక్ గజపతిరాజు

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరం నియోజకవర్గ టిడిపి పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. గురువారం నాడు స్థానిక అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయంలో పట్టణ కేంద్రంలో 26, 13 డివిజన్ల నాయకులు, కార్యకర్తలతో పాటుగా, విజయనగరం నియోజకవర్గ బీసీ సంఘ నాయకులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. వీరికి టిడిపి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు, విజయనగరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గజపతిరాజు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జ్ అతిధి గజపతిరాజు మాట్లాడుతూ పార్టీని నమ్మి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు క్రమశిక్షణతో కూడిన పార్టీ టిడిపి ప్రజలతో ఉండి పని చేస్తున్న పార్టీ. వైసిపి పార్టీ వచ్చాక ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు అన్నారు. రానున్న రోజుల్లో టిడిపి పార్టీ బీసీ ప్రత్యేక చట్టాలు తయారు చేస్తున్నారన్నారు. అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొవాలన్నారు. టిడిపి పాలెట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఒక మంచి సదుద్దేశంతో స్థాపించారు అన్నారు తెలుగు వాళ్ళందరూ బాగుపడి ఆత్మగౌరవం కోసం పాటుపడాలనే ఉద్దేశంతో స్థాపించాలన్నారు సంక్షేమ రాజ్య విధానాలు అమలు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో ఆరు లక్షల 50 వేల మంది పిల్లలకు స్కూల్స్ లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందన్నారు. రాష్ట్రంలో 14, 15 సంవత్సర ఆర్థిక సంఘం నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకుండా సొంత అవసరాలకు వాడుకుందన్నారు. నేడు అంగన్వాడి కార్యకర్తలు ఆశా వర్కర్లు తమ హక్కులకు ధర్నాలు చేస్తుంటే వారికి ఒక్కొక్కరికి ఆర్ ఎ సి చీరలు యూనిఫార్మ్స్ ఇచ్చి బాగు చేశామంటున్నారు. ఒక చీర ఒకసారి కట్టడానికి పనికిరాదు ఇంకా దేనికి బాగు చేశారని ఎదవ చేశారు. ఈ మధ్యన ఆడదాం ఆంధ్ర పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోజా జగన్ కి బూతులు నేర్పిస్తే, జగన్ రోజా కి క్రికెట్ నేర్పిస్తున్నారు ఇదేనా పరిపాలన అన్నారు. నియోజకవర్గంలో పరిపాలన కావాలి కానీ జలాశనాలు ఎవరికి కావాలి ఊరంతా ఫ్లెక్సీలు పెట్టుకొని ఆర్భాటాలు చేసుకోవడమా అని మండిపడ్డారు. ఒకపక్క రాష్ట్రం నాశనం అయిపోతుంటే ఇంకోపక్క ఏం జరుగుతుందో ప్రజలకే అర్థం కాకుండా ఉంటుందన్నారు. రాష్ట్ర భవిష్యత్ అక్కర్లేదు అనుకుంటే మరోసారి ప్రజలు తప్పు చేయకూడదు అన్నారు. ప్రజా ప్రతినిధుల్లో ఒక భవిష్యత్తు బాధ్యత ఉండాలన్నారు. వెన్నుముక లేని నాయకులను ఎన్నుకుంటే రాష్ట్ర భవిష్యత్ నాశనం అవుతుందన్నారు బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు పాత కొత్త అనే తేడా లేకుండా పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగ్ రావు, కార్యదర్శి గంటా పోల్ నాయుడు, కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు, నూతనంగా పార్టీలో చేరిన నాయకులు జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు అఖిల భారత బీసీ జిల్లా అధ్యక్షులు గదుల వెంకటరావు ,26వ డివిజన్ వైసిపి మాజీ ప్రెసిడెంట్ ముక్కాల శ్రీను, స్టేట్ బీసీ సెల్ జాయింట్ సెక్రెటరీ ఆదినారాయణ 26 బీసీ సంఘం నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది.

➡️