తీయ్యని సుందర భాష ఉర్దూ

ప్రజాశక్తి – కడప అర్బన్‌
తీయని, సుందర భాష ఉర్దూ అని, ఈ మాధ్యమం చదివే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయని వైవీయూ పీజీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ పి.ఎస్‌ షావల్లిఖాన్‌ అన్నారు. వైవీయూలోని హ్యుమానిటీస్‌ బ్లాక్‌లో ఉర్దూ శాఖ మంగళవారం ఉర్దూ దినోత్సవాన్ని ఆ శాఖ అధిపతి ఆచార్య కె. రియాజునిసా అధ్యక్షతన నిర్వహి ంచారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రిన్సిపల్‌ పిఎస్‌ షావల్లిఖాన్‌ మాట్లాడుతూ ఉర్దూను అభ్యసించే వారికి వేమన విశ్వవిద్యాలయం ఒక చక్కటి వేదిక అన్నారు. ఉర్దూ శాఖ శాఖ అభివద్ధికి అందరి సహకారం ఉందని తెలిపారు. భాషా సంస్కతి చారిత్రక నేపథ్యం ప్రస్తావించారు. ఉర్దూ మధ్య మంలో చదివినప్పటికీ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్‌, జూని యర్‌ కాలేజ్‌, ఎపిపిఎస్‌సి, యుపిఎస్‌సి వంటి పరీక్షలు రాసి పొద్దుగాల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చన్నారు. విశ్వవిద్యాలయంలో ఉర్దూ భాష ఉన్నతికి అధికారులు, ప్రతి ఒక్కరు సహక రించాలని, పరిశోధనల దిశగా నిర్ణయం తీసు కోవాల్సిందన్నారు. హ్యుమానిటీస్‌ డిన్‌ ఆచార్య తప్పెట రాంప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ అరబిక్‌, పర్షియన్‌, తుర్కీ భాషల నుంచి ఉర్దూ భాష పుట్టిందన్నారు. చరిత్ర శాఖ ఆచార్యులు కంక ణాల గంగయ్య మాట్లాడుతూ మధ్య యుగంలో ఉర్దూ ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌ డిన్‌ ఆచార్య పుత్తా పద్మ మాట్లాడుతూ చరిత్ర, సంస్కతి, మానవ సంబ ంధాలు, సమా చారం చేరవేసేందుకు భాష అవస రమన్నారు. 17 నుంచి19 శతాబ్దాల్లో ఉర్దూ భాష అభివద్ధి జరిగిందని పేర్కొన్నారు. అనంతరం ఉర్దూ భాషా దినోత్సవం సందర్భంగా పలు పోటీలు నిర్వహించి విజేతలకు అతిథులు బహు మతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలుగు శాఖ ఆచార్యులు పి రమాదేవి, పార్వతి, ఉర్దూ శాఖ అధ్యాపకులు డాక్టర్‌ ఖాజా పీర్‌, సర్దార్‌ ఖాజమైనుద్దీన్‌, డాక్టర్‌ నజీమున్నీసా, రెహనా పర్వీన్‌, సయ్యద్‌, విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.

➡️