పార్టీని మోసం చేయడంలో దిట్ట

కడప : ఎమ్మెల్సీ మాజీ మంత్రి సి. రామచంద్రయ్య నమ్ముకున్న పార్టీని మోసం చేయడంలో దిట్ట అని వైసిపి జిల్లా అధ్యక్షులు, నగర మేయర్‌ కె. సురేష్‌ బాబు అన్నారు. సోమవారం అపూర్వ కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామచం ద్రయ్యకు టిడిపిలో ఎన్టీఆర్‌ ఎంతో విలువ ఇచ్చి రాజా సభ సభ్యుడిగా పంపారని అన్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం రావడంతో ఒక్కసారిగా జంప్‌ అయ్యారు అని అన్నారు. ప్రజారాజ్యం నుంచి మళ్లీ టిడిపిలోకి వెళ్లారన్నారు. తరువాత సీనియర్‌ నేత అనే గౌరవంతో సీఎం జగన్‌ పార్టీలోకి సి. రామచంద్రయ్యను ఆహ్వానిం చారన్నారు. బలిజ కులస్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్సీ ఇచ్చి జగన్‌ సిఆర్‌సిని గౌరవిం చారని చెప్పారు. టిడిపిలో చేరుతూ వైసిపిపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంద న్నారు. ఎమ్మెల్సీ పదవికి రామచంద్రయ్య వెంటనే రాజీనామా చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు యానాదయ్య, ప్రసాద్‌ రెడ్డి, వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️