మహబూబ్‌ బాషాకు ఘన సన్మానం

ప్రజాశక్తి-కడప అర్బన్‌ సహాస్త్రాబ్ధి గాయకుడు పద్మశ్రీ మహమ్మద్‌ రఫీ 99వ జయం తోత్సవాల సందర్భంగా నగరంలోని పెద్ద దర్గా సమీపంలో ఉన్న జిఎంఆర్‌ లాడ్జి లోని సమావేశపు హాలులో సంగీత్‌ సాగర్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్ర రఫీ అవార్డు గ్రహీత షేక్‌. మహబూబ్‌ బాష (రఫీ బాష) కు ఘన సన్మానం చేశారు. ముఖ్య అతిథిగా కడప అసెంబ్లీ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న సంఘసేవకులు సయ్యద్‌ సలావుద్దీన్‌ మాట్లాడారు. మహబూబ్‌ బాష(రఫీ బాష) మహాగాయకుడు మహమ్మద్‌ రఫీ స్వరాన్ని 50 ఏళ్ళ నుంచి అనుకరిస్తు పాటలు పాడుతున్నారన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు సీనియర్‌ గాయ కులు సయ్యద్‌ నయీమ్‌,అస్గర్‌ హుసేన్‌, హుమాయున్‌ బాషా, గాయకులు గౌసేమోద్దీన్‌, అరీఫ్‌ ఖాన్‌, మదార్‌ సాహెబ్‌, తాహిర్‌అలీ, బిటీని రఫిక్‌ ఖాన్‌, అజామ్‌ పాల్గొన్నారు.

➡️