హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Dec 21,2023 13:45 #Kadapa
kadapa anganwadi workers strike 10th day cong

అంగన్వాడీల సేవలు ప్రశంసనీయం
సమ్మెకు సంపూర్ణ మద్దతు
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి
ప్రజాశక్తి-కడప అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్టు ఎదుట సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది రోజులు గా అంగన్వాడీలో సమ్మె చేస్తుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. లక్షా పదివేల మంది మహిళలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలో ఉన్నారని పేర్కొన్నారు. మహిళలు కన్నీరు కారుస్తే మంచిది కాదని పేర్కొన్నారు. శాంతియుతంగా సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని సూచించారు. అంగన్వాడీ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక అన్నారు. తెలంగాణలో మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో అందరి సహకారంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారం రోజు లోపల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం స్పందించకపోతే ఓటు అనే ఆయుధంతో అంగన్వాడీలు తమ సత్తా చూపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు విష్ణు ప్రియతమ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, ఎన్ ఎస్ యు ఐ బాబు, యూత్ కాంగ్రెస్ మధు రెడ్డి, చీకటి చార్లెస్, అలీ ఖాన్, లక్ష్మయ్య, నరసింహులు, పాలగిరి శివ, బాష, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ అర్బన్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి అంజలీదేవి, డివైఎఫ్ఐ నగర్ కార్యదర్శి ఓబులేసు, కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️