కాంక్రీట్ వేశారు.. నీరు మరిచారు..

Jan 19,2024 12:45 #Kadapa
neglect steps construction

ప్రజాశక్తి-కొండాపురం : మండల కేంద్రంలో వెలుతున్న జాతీయ రహదారి67 పనుల్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నటికి అధికారులు ఛోద్యం చూస్తున్నారు. ప్రతి పనిలోను మట్టి మొదలుకొని ఉచితంగా లభించే నీటి వరకు అవకతవల పనులను చేస్తున్నారని పత్రికలలో వచ్చినప్పటికి జాతీయ రహదారి అధికారుల్లో చలనం కలగడం లేదు. జాతీయ రహదారి పనుల్లో భాగంగా చేస్తున్న డ్రైనేజీ పనుల్లో నాశిరకం పనులు చేస్తున్నారని చెప్పడానికి మరో నిదర్శనం వెలువడింది. డ్రైనేజీ వ్యవస్థ కు ఏర్పాటు చేసిన కాంక్రీట్ పనుల్లో నాణ్యత లేకపోయినా చివరకు నీరుకూడా పట్టడం లేదు. ప్రజలు చూడటానికి కాంక్రీట్ గోడలపై పట్టలు కప్పి నీరు, పట్టినట్లు మబ్యపెడుచున్నారు. కాంక్రీట్ గోడలకు తగిన మోతాదులో నీరు పట్టకపోతే ఆ గోడలు త్వరగా కూలిపోయె ప్రమాదం కలదని, అందువలన ప్రజాధనం దుర్వినియోగం ఔతుందని మేధావులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత జాతీయ రహదారి అధికారులు నాశిరకం పనులు జరుగకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️