ప్రజల పొత్తుతోనే ఎన్నికల బరిలోకి

Jan 25,2024 15:56 #Kadapa
raghurami reddy on elections

ఎంఎల్ఏ ఎస్ రఘురామిరెడ్డి
ప్రజాశక్తి – చాపాడు : రాష్ట్రంలో మిగిలిన పార్టీలు పొత్తులు పెట్టుకుంటుంటే తాము మాత్రం ప్రజలతో మాత్రమే పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వెళుతున్నామని ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి సూచించారు. గురువారం మండల పరిధిలోని ఖాధర్ పల్లె, చిన్నగురువలూరు, బద్రిపల్లె, సోమాపురం గ్రామాలలో నూతనంగా నిర్మించిన ఆర్ బికే వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవణాలు, సీతారామపురంలో కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సోమాపురం లో ఆయన మాట్లాడుతూ టిడిపి రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు పావులు కదుపుతూ ఎన్నికల బరిలోకి వెళుతుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం నేరుగా ప్రజలతోనే పొత్తు పెట్టుకుని చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతూ ముందుకు సాగుతున్నామన్నారు టిడిపి నాయకులు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని నోటికి ఇష్టం వచ్చినట్లు వాపుతున్నారని 2014 నుంచి 19 లో అభివృద్ధి చేసి ఉంటే అదే మ్యానిఫెస్టో ప్రజల్లోకి వెళ్లాలన్నారు 2019 నుంచి 24 లో వరకు చేసిన అభివృద్ధితో వైసిపి ప్రజల్లోకి వెళుతుందన్నారు నియోజకవర్గ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామన్నారు. చంద్రబాబు హయాంలో గాలికి వదిలేసిన రోడ్లను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రజలవద్దకు వైధ్యం అందేలా చూస్తూన్నామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ పరిధిలోని రైతులకు రూపాయలు 100 కోట్లు ఇన్సూరెన్స్ రూపంలో మంజూరు అయిందన్నారు ప్రజల వద్దకే పాలన అందుతుందన్నారు. విద్య, వైద్యం కు ప్రభుత్వం చేస్తున్న సేవలను ఇతర రాష్ట్రాలు పాటించేలా ఉన్నాయన్నారు. మైదుకూరు నియోజకవర్గ పరిధిలో నక్కల దీన్నే చింతకుంట గ్రామాలకు నూతనంగా అదనపు పీహెచ్సీలు మంజూరయ్యాయి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమన్నారాయణ రెడ్డి, ఎంపిపి టి లక్ష్ముమయ్య , వైస్ ఎంపిపి శుభకరుణమ్మ, ఎంపిడిఓ శ్రీధర్ నాయుడు, పిఆర్ డిఈ మల్లేశ్వర్ రెడ్డి, ఏఈ ఈశ్వరయ్య, ఏఓ మ్యాగీ, రాధాకృష్ణ వేణి, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ మల్లేష్, మండల వైద్యాధికారి రాజేష్ కుమార్, వైసిపి నాయకులు రామ్మోహన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జయరామిరెడ్డి, సివి సుబ్బారెడ్డి, వెంకట రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, మాదవ రెడ్డి, నరసింహారెడ్డి, మహేష్ యాదవ్, సోమాపురం సర్పంచ్ శ్రీనువాసుల రెడ్డి, రామాంజనేయులు, రామసుబ్బారెడ్డి, ఓబుళ రెడ్డి,జైనుల్లా, బోలోరో బాషా, హజరత్ రెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️