ఉచితం వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Dec 21,2023 11:36 #Kadapa
utilise medical camp

ప్రజాశక్తి-పోరుమామిళ్ల : బిజీవేముల వీరా రెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నగిరి భైరవ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో బిజీవేముల వీరారెడ్డి కంటి ఆసుపత్రి నందు 24వ తేదీ ఆదివారం ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ రవికుమార్ రెడ్డి, మరియు డాక్టర్ శాంతి ఆద్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారన్నారు. 25వ తేదీ మాజీ మంత్రి వర్యులు వీరారెడ్డి వర్ధంతి సందర్భంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారన్నారు. ఈ వైద్య శిబిరంలో ఆదివారం ఉదయం 9-నుండి మధ్యాహ్నం 1-వరకు అన్ని రకముల పరీక్షలు చేసి మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు కంటి ఆపరేషన్ నిర్వహిస్తారన్నారు. ఈ సదవకాశాన్ని పోరుమామిళ్ల మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తమ వెంట ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ సెల్ నెంబర్ తీసుకువెళ్లాలన్నారు.

➡️