అమరుల స్ఫూర్తితో రైతుల పోరాటానికి సంఘీభావం

Mar 23,2024 23:28
దేశ స్వాతంత్య్రం కోసం తమ

ప్రజాశక్తి – యంత్రాంగం

దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలు ఫణంగా పెట్టిన యువ కిషోరాలు భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవుల 93 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. శనివారం జిల్లాలోని పలు మండలాల్లో ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్‌ సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవుల పోరాట స్ఫూర్తితో మతొన్మాద రాజకీయాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు.

కాకినాడ స్థానిక కచేరి పేటలోని సిపిఎం కార్యాలయంలో భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌ దేవ్‌ల 93వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి, జిల్లా ఉపాధ్యక్షులు కె.సత్తిరాజు అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంతో ఏ మాత్రమూ సంబంధం లేని శక్తులు నేడు అధికారంలో భారతదేశాన్ని పాలిస్తున్నాయని, ఎందరో త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్ర భారతాన్ని ఫాసిస్టు పాలన దిశగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకు వెళుతుందని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని సైతం ధిక్కరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్‌, కోశాధికారి మలకా రమణ, జిల్లా వర్కింగ్‌ కమిటీ సభ్యులు రమణమ్మ, నర్ల ఈశ్వరి, కామేశ్వరి నాగలక్ష్మి, వేణు, జ్యోతి, రత్న కుమారి, రాణి తదితరులు పాల్గొన్నారు.

తాళ్లరేవు స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో భగత్‌ సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌ గురు వర్ధంతి సభ ప్రజా సంఘాల కన్వీనర్‌ టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్‌.శ్రీనివాస్‌, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వళ్లు రాజుబాబు మాట్లాడారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు ఎ.బాబురావు చల్లా సంతోష్‌ కుమార్‌, గుత్తుల చెన్నయ్య, పులపకూర కృష్ణ, సుబ్బరాజు, వాసంశెట్టి సత్యనారాయణ, గుబ్బల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ స్థానిక ఇంద్రపాలెం మార్కెట్‌ వద్ద భగత్‌ సింగ్‌ విగ్రహం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, మన ఊరు మన భాధ్యత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవుల 93 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సిహెచ్‌.విజరు కుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, డివైఎఫ్‌ఐ పూర్వ జిల్లా కార్యదర్శి పెద్ధింశెట్టి రామకృష్ణ, మన ఊరు మన భాధ్యత వ్యవస్థాపకులు ఎం.రామ్మోహన్‌, యువజన సంఘం నాయకులు రవికుమార్‌, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.రాజశేఖర్‌, సుందరయ్య భవన్‌ కార్యాలయ కార్యదర్శి కె.వీరబాబు, పూర్య డివైఎఫ్‌ఐ నాయకులు చంద్రరావు, ఉదయభాస్కర్‌, సత్తిబాబు, రెడ్డి, పంచాయితీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు భద్రం, శ్రీను, సిఐటియు మండల కార్యదర్శి టి.రాజా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గంగ సూరిబాబు, ట్రేడ్‌ యూనియన్స్‌ నాయకులు ఏడుకొండలు పాల్గొన్నారు. స్థానిక జగన్నాధపురంలో భగత్‌ సింగ్‌ విగ్రహానికి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉషారాణి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పి.ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఎస్‌ఎఫ్‌ఐ హిస్టరీ డిపార్ట్మెంట్‌ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. భగత్‌ సింగ్‌, రాజ్‌ గుర్‌, సుఖదేవ్‌ చిత్రపటాలకు హిస్టరీ డిపార్ట్మెంట్‌ హెడ్‌ వెంకటేశ్వరరావు అధ్యాపకులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు హరికిషన్‌, నాయిక్‌, జాన్‌, ప్రేమకుమారి, అరుణ, ప్రత్య్రుస, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సంజరు పాల్గొన్నారు. అలాగే సిఐటియు ఆధ్వర్యంలో జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌, జిజిహెచ్‌ మెస్‌ వర్కర్స్‌ యూనియన్‌, కెఎంసి క్లాప్‌ వాహన డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నగరం అధ్యక్షులు పలివెల వీరబాబు, సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌.విజరు కుమార్‌, రమేష్‌, రవి, పుష్ప, మెస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏడుకొండలు, శ్రీను, వీరబాబు, క్లాప్‌ వాహన డ్రైవర్స్‌ యూనియన్‌ ఇస్మాయిల్‌, విక్టర్‌ సంతోష్‌ పాల్గొన్నారు. పిఠాపురం స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద గల భగత్‌ సింగ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న, రాజు, వీరబాబు, విశ్వనాథం మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు డి.సత్యనారాయణ, సూర్యనారాయణ, నేరియ్య, శ్రీను, నూకరాజుదొర, శ్రామిక మహిళలు విజయ శాంత పాల్గొన్నారు.

పెద్దాపురం స్థానిక నువ్వుల గుంట వీధి సెంటర్‌లో ఉన్న భగత్‌ సింగ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిఐటియు నాయకులు డి.క్రాంతి కుమార్‌ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గోపాలకృష్ణ, అరుణ్‌ కుమార్‌, సిఐటియు నాయకులు గడిగట్ల సత్తిబాబు, చింతల సత్యనారాయణ, ఎస్‌.శ్రీనివాస్‌, ప్రజానాట్యమండలి నాయకులు దారపురెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజు, దారపురెడ్డి సత్యనారాయణ, మహాపాతిన రాంబాబు, కార్మిక నాయకులు కూనిరెడ్డి అప్పన్న, నెక్కల నరసింహమూర్తి పాల్గొన్నారు. అలాగే మండలంలోని పులిమేరు గ్రామంలో ఎఐఎఫ్‌టియు, ఎపిఆర్‌సిఎస్‌ ఆధ్వరంలో వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కుంచె అంజిబాబు, వల్లూరి రాజబాబు, రామలక్ష్మి పాల్గొన్నారు.

సామర్లకోట స్థానిక భగత్‌ సింగ్‌ విజ్ఞాన కేంద్రంలో రోటరీ బ్లడ్‌ బ్యాంక్‌ కాకినాడ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్‌ కుమార్‌ మాట్లాడారు. ఈ రక్తదాన శిబిరంలో 48 మంది రక్తదానం చేశారు. ఈ రక్తదానం చేసిన వారిలో 48సార్లు చెక్కల రాజకుమార్‌, 32 సార్లు మామిడి కృష్ణ రక్తదానం చేశారు. భగత్‌ సింగ్‌ విజ్ఞాన కేంద్రం అధ్యక్ష, కార్యదర్శులు బాలం హరిబాబు, చల్లా మహేష్‌, నాయకులు బాలం శ్రీనివాస్‌, కరణం ప్రసాద్‌ రావు, కరణం గోవిందరాజు, మహిళా సంఘం నాయకులు వరలక్ష్మి, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు నాగమణి, ఎస్తేరు రాణి పాల్గొన్నారు.

కాకినాడ రూరల్‌ స్థానిక తూరంగి అల్లూరి సీతారామరాజు కాలనీలో సిపిఎం నాయకులు సిహెచ్‌.అజరు కుమార్‌, కొవ్వాడ గ్రామపంచాయతీ కార్మికులతో మేడిశెట్టి వెంకటరమణ, ఇండిస్టీయల్‌ ఏరియాలో సిఐటియు కాకినాడ రూరల్‌ ఇండిస్టియల్‌ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వర్థంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జోగా అప్పారావు, బండారు నాగేశ్వరరావు, బండారు ఆంజనేయిలు, తటవర్తి సుబ్బారావు, చిట్టిమేను ప్రసాద్‌ పాల్గొన్నారు. అలాగే వలసపాకల సుందరయ్య కాలనీలో సిఐటియు ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవుల వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కన్వీనర్‌ టి. రాజా, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, చింత శ్రీహరి, బలరాం, సంగీతరావు, నూకరాజు, రాంబాబు, రాము, దుర్గాప్రసాద్‌, పాల్గొన్నారు.

కాజులూరు మండలంలోని కోలంక గ్రామంలో భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖదేవుల వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చల్ల సంతోష్‌ కుమార్‌ కుంభత్తుల వెంకటరమణ మారెళ్ళ నరసింహమూర్తి, బండారు వీరబాబు, బూరెల చిన్న, పెద్దిరెడ్డి రాజు, నందికోల సత్తిబాబు, యాళ్ళ బాబురావు పాల్గొన్నారు.

➡️