అరబిందో ఫార్మా పైపులైన్‌ తొలగించాలి

Mar 9,2024 23:26
అరబిందో ఫార్మా పైపులైన్లు

ప్రజాశక్తి – యు.కొత్తపల్లి

అరబిందో ఫార్మా పైపులైన్లు తొలగిం చాలని ఆంధ్రప్రదేశ్‌ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లాటి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. స్థానికంగా గత 4 రోజులుగా ఆందోళన చేస్తున్న మత్య్స కారుల శిబిరాన్ని శనివారం ఆయన సంద ర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఫార్మా పైపులైన్‌ వల్ల కలుగుతున్న ఇబ్బం దులపై మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణ మన్నారు. ఇప్పటికే మత్య్సకారులు తమ సమస్యను ఉన్నతా ధికారుల దృష్టికి తీసుకెళ్లారని, అయినా ఏమాత్రం స్పందించ కపోవడం దుర్మా ర్గమని అన్నారు. పరి శమకు సంబంధించిన వ్యర్థాలను సము ద్రంలోకి కలపడం ద్వారా మత్య్సకారుల జీవ నోపాధిని దెబ్బతీసేలా కంపెనీ యాజమాన్యం ప్రయత్నిస్తుం దన్నారు. ఎంపి వంగా గీత మత్స్యకారుల శిబిరాన్ని సందర్శించినా మత్య్సకారులకు అండగా నిలుస్తామనే మాట రాలేదని, పైపులైన్‌ను అడ్డుకోవడం సాధ్యం కాదని చెప్పడం సిగ్గుచేటన్నారు. మత్స్యకారులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు పరిశ్రమల యాజమాన్యాలకు అను కూలంగా వ్యవహరించడం సరికాద న్నారు. తక్షణమే మత్య్స కారుల డిమాండ్లను పరిష్కరించేలా జిల్లా అధికార యంత్రాంగం చొరవచూపాలని డిమాండ్‌ చేశారు. మత్య్సకారుల ఉద్యమానికి మత్య్స కార్మిక సంఘం అండగా ఉటుందన్నారు. ఈ కార్య క్రమంలో మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రి చంద్ర శేఖర్‌, సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్‌.రమణి పాల్గొన్నారు.జీవనభృతికి అవరోధం లేకుండా చూస్తా..ఎంపి గీత మత్స్యకారులు వేటకు వెళ్ళడానికి అవరోధం లేకుండా బోట్లు, వలలు దెబ్బతినకుండా వేట సజావుగా సాగేలా చూస్తానని ఎంపి వంగా గీత హామీ ఇచ్చారు. గత నాలుగు రోజులుగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళన శిబిరాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మత్య్సకారుల సంఘం నాయకులు పల్లేటి బాపన్నదొర, కంబాల దాసుబాబు, ఉమ్మిడి చిన్న మాట్లాడుతూ అరబిందో ఫార్మా కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థాల వల్ల మత్య్స సంపద నశించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోమవారం కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు, అరబిందో ఫార్మా కంపెని ప్రతినిధులతో మత్స్యకారుల సమస్యపై చర్చిస్తానని అన్నారు.

➡️