అసమానతలు తొలగించేలా ప్రభుత్వ పాలన

Feb 4,2024 22:51
రాష్ట్రంలో ఉన్న అసమానతలను

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

రాష్ట్రంలో ఉన్న అసమానతలను తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందని మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ అన్నారు. జడ్‌పి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అమ్మ ఒడి పథకం ద్వారా బాల కార్మిక వ్యవస్థను రూపుమాపటం జరిగిందని, రాష్ట్రంలో ఎక్కడ బాల కార్మికులు కనపడటం లేదన్నారు. సిఎం ప్రవేశపెట్టిన పథకాల అమలు సంస్కరణలో భాగంగా అమ్మ ఒడి అనే పథకం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ బాల కార్మికులు లేని వ్యవస్థ ఉందని, అవసరమైతే పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయన్నారు. గత పాలకులు మహిళా సంఘాలకు అన్యాయం చేసిన సందర్భాలను గుర్తించిన సిఎం జగన్‌ ఆసరా పథకం ద్వారా ఆదుకున్నారని అన్నారు. ఇంగ్లీష్‌ను ప్రోత్స హించడం ద్వారా చదువుకునే విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని కల్పించారని తెలిపారు. విద్యా, వైద్య రం గానికి అధిక ప్రాధాన్యత ఇస్తు న్నట్లు చెప్పారు. ప్రతి సామా న్యుడికి నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ లో వైద్యాన్ని పొందేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. వ్యవస్థలో పరిపాలన సజావుగా జరగాలంటే శాసన, పరిపాలన, న్యాయంతోపాటు మీడియా ఈ నాలుగు రంగాలు కలిసి పని చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు.

➡️