ఆదిత్య కళాశాలలో నెక్సస్‌-2024 ఫెస్ట్

Mar 22,2024 22:15
ఆదిత్య కళాశాలలో నెక్సస్‌-2024 ఫెస్ట్

ప్రజాశక్తి-కాకినాడ స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల డేటా సైన్స్‌ విభాగం ఆధ్వర్యంలో నెక్సస్‌-2024 సైన్స్‌ ఫెస్ట్‌ ఘనంగా నిర్వహించినట్లు డిగ్రీ, పీజీ కళాశాలల అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బిఇవిఎల్‌ నాయుడు తెలిపారు. విద్యార్థులకు సాంకేతిక రంగంలో నూతన అంశాలను తెలియజేసేందుకు ఈ ఫెస్ట్‌ నిర్వహించినట్టు చెప్పారు. నూతన పరిజ్ఞానాన్ని విద్యార్థులు తెలుసుకోవాలని, నేడు ఎఐ టెక్నాలజీ, డేటా సైన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీలపై విద్యార్థులు దృష్టి సారించాలని తెలిపారు. ఆదిత్య డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, ఈ విధమైన సదస్సులు విద్యార్థుల సాంకేతి పరిజ్ఞానం పెంపొందించుకోవడానికి, భావ వినిమయానికి దోహదపడతాయని తెలిపారు.

➡️