ఆధునిక సాంకేతికతతో అమ్మ భాషకు అందలం

Feb 21,2024 23:18
సాంకేతిక వికాసంతో భాషా,

ప్రజాశక్తి – కాకినాడ

సాంకేతిక వికాసంతో భాషా, సాహిత్యాలు ప్రజలందరికీ చెందుతున్నాయని ప్రముఖ వైద్యులు డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ అన్నారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా కాకినాడ పిఆర్‌ ప్రభుత్వ కళాశాలలో హిందీ తెలుగు, హిందీ, సంస్కృత శాఖల ఆధ్వర్యంలో బుధవారం మాతృభాషా దినోత్సవం నిర్వహిం చారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వి.తిరుపాణ్యం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు సొంత ప్రాంతానికి చెందిన భాషలో ప్రవేశం, ప్రావీణ్యం సంపాదిం చుకోవడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. ఆధునిక సాంకేతికత, సామాజిక మాధ్యమాల మూలంగా అమ్మ భాష ప్రస్తుతం అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. భాషా నైపుణ్యాలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకోవడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో రాణించగలమని అన్నారు. పిఆర్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం గౌరవ అధ్యక్షులు కర్రి భామిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నన్నయ విశ్వ విద్యాలయం తెలుగు ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి.సత్య నారాయణ మాట్లాడుతూ ఇంగ్లీష్‌ మీడియం వల్ల తెలుగు అంతరించిపోదన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాతృభాషతో పాటు తప్పనిసరిగా మరో భాషను నేర్చుకోవాలని చెప్పారు. చారిత్రక రచయిత ర్యాలి ప్రసాద్‌ మాట్లా డుతూ ఉద్యోగ, ఉపాధి కోసం వేరే భాషను నేర్చు కోవాలని, అయితే జాతి ఉనికి అమ్మ భాషతోనే ముడిపడి ఉంటుందని అన్నారు. తదుపరి వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమ తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యా పకులు కె. ఆంజనేయులు, పి.హరిరామప్రసాద్‌, వై.బుజ్జి, టి.రాజశేఖర్‌, కె.అరుణ, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️