ఆప్త ద్వారా సేవలు మరింత విస్తృతం

Mar 3,2024 23:22
అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు

ప్రజాశక్తి – కాకినాడ

అమెరికన్‌ ప్రోగ్రెసివ్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆప్త) ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా విస్తరిస్తామని ఆప్త ప్రతి నిధులు తెలిపారు. ఆదివారం కాపు కళ్యాణ మండపంలో సుమారు 211 మంది విద్యార్థులకు ఆయా తరగతులు బట్టి ఉపకార వేతనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం జరి గింది. ఈ కార్యక్రమంలో రాజీవ్‌ గాంధీ కళాశాల చైర్మన్‌ పోతుల విశ్వం పాల్గొని మాట్లాడారు. ప్రతిభ ఉన్న విద్యార్థి పేదరికం అనే అడ్డంకి ద్వారా చదువుకు దూరమవ్వకూడదనే నినాదంతో ఆప్త ఏర్పాటు కావడం ఆనందకరమన్నారు. చదువులో రాణించిన విద్యార్థులు ఉన్నత స్థానానికి వెళ్ళినా తర్వాత తిరిగి ఆప్తకు సహకారం అందించి మరింత మంది విద్యార్థులకు ప్రోత్సాహకారానికి తోడ్పడాలని కోరారు. విద్య సమాజంలో మార్పునకు ముఖ్య కారణమని, దీని ప్రతి ఒక్కరు గమనించాలని కోరారు. ఆప్త ప్రతినిధులు వెంకట్‌ సాన, శ్రీధర్‌ ఆకుల, సానా నాగేశ్వరరావులు మాట్లాడుతూ ఆప్త 2018లో ఏర్పాటు చేసి ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆప్త ద్వారా సేవలను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రవీణ్‌ సానా, అడ్డాల సత్యనారాయణ, సుంకర సుమ, జిఎస్‌ మూర్తి, సుంకర ప్రకాష్‌, పేపకాయల రామకృష్ణ, బలరాం, భాస్కర్‌, భార్గవ్‌, రాజా ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️