కొనసాగిన శానిటేషన్‌ కార్మికుల ఆందోళన

Feb 28,2024 23:48
జిజిహెచ్‌ శానిటేషన్‌

ప్రజాశక్తి – కాకినాడ

జిజిహెచ్‌ శానిటేషన్‌ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న పోరాటం 26వ రోజు కొనసాగింది. ఈ పోరాట సందర్భంగా జిజిహెచ్‌ తల్లి పిల్ల బొమ్మ వద్ద ధర్నా చేసి అనం తరం హాస్పటల్‌ ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సిఐటియు కోశాధికారి మలక వెంకటరమణ పాల్గొని మాట్లాడారు. శానిటేషన్‌ కార్మికుల సమస్యపై 26 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న పరిష్కారం దిశగా కాంట్రాక్టర్‌ దృష్టి సారించడం లేదన్నారు. గురువారం నుంచి పోరా టం మరింత ఉదృతం చేయడానికి కార్మికుల సిద్ధప డుతున్నారన్నారు. బుధవారం సంఘ నాయ కులతో కాంట్రాక్టర్‌ చర్చలు జరిపారని, అయితే కార్మికులకు ఆమోదయోగ్యం కాకపోవడంతో తమ ఆందోళనను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కూడా కాంట్రాక్టర్‌ కార్మిక నాయకులతో చర్చలు చేసినా కార్మికుల అంగీకరించే విధంగా చర్చలు లేవని అందుచేత పోరాటాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్‌.విజరు కుమార్‌, శేషు, రమేష్‌, వాసు, రవి, శ్రీకాంత్‌, లక్ష్మీ ప్రియ, కుమారి, పుష్ప, చంద్రకళ పాల్గొన్నారు.

➡️