గుండెపోటుతో మత్య్సకారుడు మృతి

Feb 19,2024 22:27
ఉప్పలంక గ్రామా నికి చెందిన

ప్రజాశక్తి – కరప

ఉప్పలంక గ్రామా నికి చెందిన మత్స్యకారుడు వేటకు వెళ్లిన సమయంలో గుండెపోటు రావడంతో పరి స్థితి విషమించి మృతి చెం దాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం గ్రామా నికి చెందిన మత్స్యకారుడు పిసింగి వెంకటేశ్వర్లు(52) చేపల వేటకు వెళ్లాడు. వేట సమయంలో గుండె నొప్పి వస్తుందని తన తోటి వాళ్లకు చెప్పటంతో వారు వెంటనే వైద్యం కోసం వెనుతిరిగారు. అయితే ఒడ్డుకు తీసుకొచ్చిన అతడి పరిస్థితిని వైద్యులు పరీక్షించారు. అయితే అప్పటికే ఆ మత్య్సకారుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మతునికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, భార్య ఉన్నారు. అతని భార్య క్యాన్సర్‌ వ్యాధితో బాదపడుతోంది. ఈ సమయంలో కుటుంబ యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్‌ నయోమి సతీష్‌ కోరారు.

➡️