మున్సిపల్‌ కమిషనర్‌ బాధ్యతల స్వీకరణ

Feb 2,2024 23:17
మున్సిపల్‌ కమిషనర్‌ బాధ్యతల స్వీకరణ

ప్రజాశక్తి-కాకినాడ కాకినాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా జె.వెంకటరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కమిషనర్‌ సిహెచ్‌.నాగనరసింహారావు నుంచి బాధ్యతలు తీసుకుని విధుల్లో చేరారు. పార్వతిపురం జిల్లా డిఆర్‌ఒగా పని చేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. వివిధ విభాగాధిపతులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతోపాటు, నాణ్యమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కమిషనర్‌ కలిసిన వారిలో ఎస్‌ఇ సత్యకుమారి, కార్యదర్శి ఎం.ఏసుబాబు, డిప్యూటీ కమిషనర్‌ కోన శ్రీనివాస్‌, మేనేజర్‌ కర్రి సత్యనారాయణ, స్మార్ట్‌సిటీ ఎస్‌ఇ వెంకటరావు, ఎంహెచ్‌ఒ డాక్టర్‌ పృథ్వీచరణ్‌, తదితరులు ఉన్నారు.

➡️