రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీలు ప్రారంభం

Feb 24,2024 23:35
రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీలు ప్రారంభం

ప్రజాశక్తి-కాకినాడస్థానిక డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఇంటర్నేషనల్‌ ఇండోర్‌ స్కేటింగ్‌ రింక్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీలను కాకినాడ ఎంపీ వంగా గీత, ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఎంపీ గీత మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణా లతో తొలి ఇండోర్‌ స్టేటింగ్‌ రింక్‌ దేశంలోనే తొలిసారిగా కాకినాడలో ఏర్పాట య్యిందన్నారు. ఈ స్కేటింగ్‌ రింక్‌ క్రీడారంగంలో ఒక కలికితు రాయిగా అభివర్ణించారు. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్న కాకినాడ వంటి ప్రాంతంలో ఇటువంటి అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్కేటింగ్‌ రింక్‌ ఏర్పాటు కావడం ఈ ప్రాంత ప్రతిష్టను మరింత పెంచుతుందన్నారు. ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ క్రీడారంగంలో ఎన్నో విజయాలు సాధిస్తున్న కాకినాడలో ఏర్పాటైన ఇంటర్నేషనల్‌ స్కేటింగ్‌ రింక్‌ ఈ ప్రాంత స్కేటింగ్‌ క్రీడాకారులకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుందన్నారు. 200 మీటర్ల ట్రాక్‌తో పాటు, వీక్షకుల కోసం గ్యాలరీ, టాయిలెట్స్‌, కార్యాలయం సహా అన్ని సదుపాయాలనూ తక్కువ వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో నిర్మించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి క్రీడా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇటీవల నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమమే ఇందుకు నిదర్శనం అన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ఆడుదాం-ఆంధ్ర పోటీలను సిఎం నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి కర్రి పద్మశ్రీ, కుడా చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.వెంకటరావు, ఎడిసి సిహెచ్‌.నాగ నరసింహారావు, మాజీ మేయర్‌, వైసిపి నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, ఎపి రోలర్‌ స్కేటింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆర్‌.రాజగోపాల్‌, స్మార్ట్‌ సిటీ ఎస్‌ఇ పి.వెంకటరావు పాల్గొన్నారు.

➡️