వేగంగా రైల్వే ట్రాక్‌ మరమ్మత్తు పనులు

Feb 28,2024 23:49
సామర్లకోట రైల్వే ఉత్తర

ప్రజాశక్తి – సామర్లకోట

సామర్లకోట రైల్వే ఉత్తర క్యాబిన్‌ వద్ద నుంచి రైల్వే ట్రాక్‌ మరమ్మ తు పనులు జోరుగా జరుగు తున్నాయి. ఈ కారణంగా రైల్వే గేట్‌ బుధవారం మూత పడింది. రైల్వే అధికారులు ముందిగానే ప్రకటించిన రీతిగా ట్రాక్‌ మరమ్మతు పనులను ఉదయం ప్రారం భించారు. దానితో ప్రయాణి కులకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాక్‌ వద్ద సుమారు ఐదులైన్ల వద్ద ఉన్న బల్లాస్ట్‌, రైలు పట్టాలు మార్పిడి పనులు వేగవం తంగా జరుగుతున్నాయి. మార్చి 6వ తేదీ సాయం త్రం వరకూ ట్రాక్‌ మరమ్మతు పనులు కొనసాగ నున్నట్టు అధికారులు చెప్పారు. గేటు మీదుగా వెళ్లే వాహనాలను రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి మీదుగా మళ్లించారు. అయితే ప్రధానంగా వాహనాల మాటేలా ఉన్నా రైతులు, పశువులకు రైలు గేటు మీదుగానే రాకపోకలు అలవాటు కావడంతో ఆమేరకు వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

➡️