సమ్మెలోకి జిజిహెచ్‌ శానిటేషన్‌ కార్మికులు

Mar 11,2024 23:34
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్‌

ప్రజాశక్తి – కాకినాడ

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్‌ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. గత 35 రోజులుగా తమ సమస్యలను పరిష్కరిం చాలని వివిధ రూపాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌ కార్మిక సంఘం నాయకులతో కంటి తుడుపుగానే చర్చలు నిర్వహించారు. కానీ కార్మి కుల ప్రధాన డిమాండ్లపై సానుకూలంగా స్పందిం చిన దాఖలాలు లేవు. తమ సమస్యలు పరిష్కరిం చని పక్షంలో సమ్మెలోకి వెళ్లడం తప్పదని ఇప్పటికే వైద్యా ఆరోగ్య శాఖ అధికారులకు సమ్మె నోటీసులు అందచేశారు. అయినా అటు అధికారుల నుంచి, ఇటు కాంట్రాక్టర్‌ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సోమవారం నుంచి కార్మికులు సమ్మె బాట పట్టారు. అత్యవసర విభాగాల్లో సేవలు అందిస్తూనే సమ్మె చేయాలని యూనియన్‌ నాయకత్వం నిర్ణయించింది. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విఠల్‌ జోక్యంతో కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు కార్మికులతో సోమ వారం పలు దఫాలుగా చర్చలు సాగించారు. అయితే యజమానులు చెల్లించాల్సిన పిఎఫ్‌, ఇఎస్‌ఐ వాటా విషయాన్ని పక్కన పెట్టిన కాంట్రాక్ట్‌ సంస్థ ప్రతినిధులు కొద్ది మేర జీతాన్ని పెంపుదల చేస్తామని మాత్రమే హామీ ఇచ్చారు. దీనికి కార్మి కులు అంగీకరించలేదు. కార్మికుల జీతాల నుంచి కోత పెట్టిన పిఎఫ్‌, ఇఎస్‌ఐ పాద బకా యిలను చెల్లించాలని, అలాగే సంబంధిత వాటా ను ఇకపై యాజమాన్యమే చెల్లించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. దీంతో చర్చలు విఫలం అయ్యాయి. మంగళవారం మరో సారి చర్చలు నిర్వహించాఆలని కార్మికుల జనరల్‌ బాడీ సమావేశం నిర్ణయించింది. మాతా శిశు విభాగం వద్ద సమ్మె శిబిరంలో నిరసన వ్యక్తం చేశారు. శానిటేషన్‌ కార్మికుల సమ్మెకు పలు సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ కార్య క్రమంలో సిఐటియు నాయకులు పలివెల వీర బాబు, మలక వెంకటరమణ, పాలిక రాజేంద్ర ప్రసాద్‌, యూనియన్‌ నాయకులు సిహెచ్‌. విజరుకుమార్‌, జె.శేషు, ఆర్‌.రమేష్‌ పాల్గొన్నారు.

➡️