క్యాంపస్‌ ఇంటర్వ్యూలో 104 మంది ఎంపిక

Apr 15,2024 23:15
స్థానిక శ్రీ ప్రకా ష్‌

ప్రజాశక్తి – కోటనందూరు

స్థానిక శ్రీ ప్రకా ష్‌ విద్యా సంస్థల అనుబం ధ సంస్థ స్పేసెస్‌ డిగ్రీ కళా శాలలో నిర్వహించిన క్యాం పస్‌ ఇంటర్వ్యూలలో 1014 మంది విద్యార్థులు ఎంపిక య్యారు. ఈ నెల 12వ తేదీన నిర్వహించిన ఇంటర్వూ లు డేటా ప్రో ఆధ్వర్యంలో జరిగాయి. డిషైన్‌ ప్రో, రెండ్స్టడ్‌, నవతా, అపోలో, ముత్తూట్‌ కంపెనీలు ఈ ఇంటర్వూలులో పాల్గొన్నారు. కళా శాల నుంచి ఫైనల్‌ ఇయర్‌ బిఎస్‌సి, బీకాం, బిబిఎ చదువుతున్న, పూర్త యిన విద్యార్థులు సుమారు 200 మంది పాల్గొన్నారు. ఈ క్యాంపస్‌ ఇంటర్వ్యూలకు హాజరైన డేటా ప్రో సంస్థ హెచ్‌ఆర్‌ సి.తేజ పాల్గొని విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. సంస్థకు సంబంధించిన పద్ధతులను, నియమాలను వివరిం చారు. అనంతరం ఎంపిక ప్రక్రి యలో 104 మంది విద్యా ర్థులు వివిధ కంపెనీలు డిషైన్‌ ప్రో -72, రెండ్స్టడ్‌ -7, నవతా -5, అపోలో -7, ముత్తూట్‌ -13 మంది పని చేయుటకు అర్హత సాధించార ని సహాయ కార్యదర్శి సిహెచ్‌. విజరుప్రకాష్‌ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్‌ వికె.నరసిం హారావు అభినం దనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిషైన్‌ కంపెనీ హెచ్‌ఆర్‌ డేవిడ్‌ సురేందర్‌, సంస్థల ఎగ్జిక్యూటివ్స్‌ ఎస్‌.సుధీర్‌, డి.వేద వ్యాస్‌ పాల్గొన్నారు.

➡️