16న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

Feb 14,2024 22:59
ఈ నెల 16న దేశవ్యాప్తంగా

ప్రజాశక్తి – కాకినాడ

ఈ నెల 16న దేశవ్యాప్తంగా జరుగుతున్న ట్రాన్స్‌పోర్ట్‌ సమ్మెను కార్మిక, కర్షకలోకం జయప్రదం చేయాలని ఆల్‌ ఇండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ జాతీయ కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య పిలుపు నిచ్చారు. ది కాకినాడ మినీ గూడ్స్‌ లారీ అండ్‌ వేన్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ భవనంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జి అధ్యక్షతన ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికుల జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సులో లక్ష్మయ్య మాట్లా డుతూ ప్రతీ డ్రైవరు వాహనం కదిలించే టప్పుడు తమ ఇష్టదైవాన్ని ప్రార్ధించి సుర క్షితంగా ఇంటికి చేరాలని కోరుకునే మొదటి వ్యక్తిని అన్నారు. దేశవ్యాప్తంగా జరిగే మొత్తం ప్రమాదాల్లో రెండు శాతం ప్రమాదాలు 67 శాతం జాతీయ రహదారుల్లోనే జరుగు తున్నాయని అన్నారు. ఈ ప్రమాదాల నివా రణకు కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణను యుద్ధప్రాతిపదికపై నిర్మించాల్సి పోయి ప్రమాదాలకు డ్రైవర్లను బాధ్యులను చేయడం దారుణమన్నారు. జాతీయ రహ దారిపై ఎక్కడా డ్రైవర్లకు విశ్రాంతి సదు పాయం ఏర్పాటు చేయకుండా ప్రమాదాలను నివారించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నేషనల్‌ పర్మిట్లు కలిగి రాష్ట్రాలు దాటివెళ్లే రవాణా వాహనాలకు ఇద్దరు డ్రైవర్లు ఉండాలనే నిబంధనను కేంద్ర ప్రభుత్భం తొల గించి ప్రమాదాలు పెరగడానికి కారణ మవుతుందని విమర్శించారు. ప్రతీ 100 కిలోమీటర్లకు 28 యూటర్న్స్‌ జాతీయ రహదారులపై ప్రభుత్వమే ఏర్పాట్లు చేసి టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి జరిగిన లాంటి ప్రమాదాలు పెరగడానికి కారమవుతుందని ధ్వజమెత్తారు. దేశంలో అతి పెద్ద ప్రమాదమైన జబ్బార్‌ ట్రావెల్స్‌ ఘటనలో కారణా లను విశ్లేషిస్తూ ఐపిఎస్‌ అధికారి ఇచ్చిన నివేదికలో తీసుకోవాల్సిన చర్యలు ఇప్పటి వరకు తీసుకోకుంటే ప్రమా దాల నివారణ ఎలా సాధ్యమని నిలదీశరు. ప్రపంచంలో ఎక్కడా ఇంత దారుణమైన జరిమానాలు విధించటం లేదని, వ్యక్తి ఆదాయాన్ని బట్టి జరిమానాలు విధించే శాస్త్రీయ పద్ధతులు పాటించకుండా బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరు ద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు ఫిబ్రవరి 16 దేశవ్యాప్తంగా జరిగే ట్రాన్స్‌ పోర్ట్‌ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో వివిధ ట్రాన్స్‌పోర్ట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌, ఆటో యూనియన్స్‌ ప్రతినిధులు బొగ్గు సత్యనారా యణ, తాతపూడి మూర్తి, వై నాగ రాజు, గుండుబోగుల శ్రీను, పెండెం సత్యనారాయణ, రెడ్డిపల్లి రమేష్‌, ఎలుగుబంటి లక్ష్మీనారాయణ, తులసి ప్రసాద్‌, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, తదితరులు పాల్గొన్నారు. ఏలేశ్వరం స్థానిక లారీ వర్కర్స్‌ యూనియన్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిఐటియు నాయకులు పాకలపాటి సోమరాజు, రొంగల ఈశ్వరరావు మాట్లాడుతూ అనుకోకుండా ప్రమాదం జరిగి ఎవరైనా మృతి చెందితే డ్రైవర్‌కు పదేళ్లుజైలు, రూ.10 లక్షల జరిమాని విధించేలా చట్టం చేయడం దారుణమన్నారు. ఈ చట్టం వల్ల ట్రాన్స్‌పోర్ట్‌ కార్మికుల తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారని అన్నారు. ఈ చట్టానికి వ్యతి రకంగా 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో కార్మి కులు పాల్గొని జయప్రదం చేయాలని కోరా రు. ఈ కార్యక్రమంలో లారీ వర్కర్స్‌ యూని యన్‌ నాయకులు కె.సత్యనారాయణ, ఎస్‌. వెంకటేష్‌, బి.సురేష్‌, డి.చిన్నారావు, షేక్‌ సత్తార్‌, ఎస్‌.శ్రీనివాసరావు, ఆర్‌.నవీన్‌, బి.వీరబాబు, ఎన్‌ శ్రీనివాస్‌, పి.రామకష్ణ, బి.శివ పాల్గొన్నారు. 16న బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సమ్మె బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థను ప్రయివేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 16న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. భోజన విరామ సమయంలో కాకినాడ మెయిన్‌ రోడ్డులోని బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ఉమామహేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌ మాట్లాడుతూ బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆధునీకరణకు ప్రభుత్వ నిబంధనలు ఆటం కంగా ఉన్నాయని అన్నారు. ఇందుకు నిరసనగా ఫిబ్రవరి 16 జరిగే దేశవ్యాప్త ఒకరోజు సమ్మెలో బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల తోపాటు బిఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు పొందే ప్రజానీకం కూడా సమ్మెకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిఎస్‌ ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా సహాయ కార్యదర్శి కె.శివప్రసాద్‌, మహిళ విభాగం నాయకురాలు డి.జగదీశ్వరి, కుడిపూడి ఉమమహేశ్వరరావు, కె.ప్రభా కరరావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ పాల్గొన్నారు.

➡️