రైల్వేస్టేషన్‌లో 60 సిసి కెమెరాలు

Apr 13,2024 21:59
ప్రయాణికుల భద్రతలో

ప్రజాశక్తి – సామర్లకోట

ప్రయాణికుల భద్రతలో భాగంగా సామర్లకోట రైల్వేస్టేషన్‌లోని 1, 2 ఫ్లాట్‌ఫారాలపై 60 సిసి కెమెరాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కాకినాడ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ కెవి.గిరి తెలిపారు. శనివారం స్థానిక రైల్వేస్టేషన్లో స్టేషన్‌ మేనేజర్‌ ఎం.రమేష్‌ ఆధ్వర్యంలో ప్రయాణికుల భద్రతపై సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఫ్లాట్‌ ఫారాల ఆధునీకరణ అనంతరం సిసి కెమెరాలను ఏర్పా టు చేస్తామని చెప్పారు. సాధారణ ఎన్నికల దృష్ట్యా రైళ్ల ద్వారా అనధికారిక నగదు, మద్యం, తరలింపులు చేపట్టకుండా చర్యలు చేపట్టాలని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. సామర్లకోటతోపాటు, పిఠాపురం, అనపర్తి, బిక్కవోలు రైల్వేస్టేషన్‌లో త్వరలో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో రైల్వే సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ ఎ.బసవేశ్వరరావు, చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎవికె.సంతోష్‌కుమార్‌, సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్లు నారాయణరాజు, సంజీవ్‌కుమార్‌, రైల్వే ఎస్‌ఎస్‌ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

➡️