రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు సహకరిస్తా : కాకినాడ ఎంపీ గీత

Mar 1,2024 15:18 #Kakinada
Assists in railway station development works

ప్రజాశక్తి – సామర్లకోట : అమృతభారత్ పథకంలో జరుగుతున్న సామర్లకోట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తానని కాకినాడ ఎంపీ వంగా గీత చెప్పారు. శుక్రవారం సామర్లకోట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అమృత భారత్ అభివృద్ధి పనులను ఎంపీ గీత పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరాలను రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ అభివృద్ధికి తన వంతు కర్తవ్యంగా శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎంపీ గీత హామీ ఇచ్చారు. అనంతరం వందేభారత్ ఎక్స్ప్రెస్ లో ఆమె విజయవాడ వెళ్ళారు.

➡️