ఓటు వినియోగంపై అవగాహన పెంచుకోవాలి

Apr 13,2024 22:03
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు

ప్రజాశక్తి – పెద్దాపురం

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచుకోవాలని ఎంసిసి కన్వీనర్‌, ఎంపిడిఒ జి.ఉషారాణి అన్నారు. శనివారం మండలంలోని తిరుపతి, చంద్రమాంపల్లి గ్రామాల్లో ఆమె మహిళలకు ఓటింగు యంత్రాలపై ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె ఓటింగ్‌ మిషన్‌ పనిచేసే విధానం, యంత్రంపై తమ అభ్యర్థికి ఓటు వేసిన తర్వాత జరిగే ప్రక్రియ ఓటర్లకు వివరించారు. ఓటు ఉన్న ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగిం చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

➡️