ఘనంగా జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుక

Apr 5,2024 23:18
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతిని

ప్రజాశక్తి – యంత్రాంగం

మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కాకినాడ స్థానిక ఇంద్రపాలెం లెడీస్‌ లయన్స్‌ క్లబ్‌ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, జెసి ఎస్‌.రామ్‌సుందర్‌ రెడ్డి, జడ్‌పి సిఇఒ ఎ.శ్రీరామచంద్రమూర్తి, కాకినాడ కమిషనర్‌ జె.వెంకటరావు, ఇతర ప్రజాసంఘాల నాయ కులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ జగజ్జీవన్‌ రామ్‌ మనందరికీ స్ఫూర్తిని ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ జెడి రమణమూర్తి, పశుసంవర్ధక శాఖ జెడి ఎస్‌.సూర్య ప్రకాశరావు, ఆర్‌డిఒ ఇట్ల కిషోర్‌ పాల్గొన్నారు.

రౌతులపూడి మండల కేంద్రంలో ఆదిఆధ్ర అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తేల అబ్బు, కె.నాని, జి.నూకరాజు పాల్గొన్నారు. అలాగే రెవెన్యూ కార్యాలయంలో జగజ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి తహశీల్దార్‌ శాంతిలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ వేగేశ్వరరావు, గ్రామ రెవెన్యూ ఉద్యోగ సంఘ అధ్యక్షులు ఈశ్వరరావు, అధికారులు సత్తిబాబు, సూర్యనారాయణ మూర్తి, సుబ్రమణ్యం, శ్రీనివాస్‌, దుర్గారావు పాల్గొన్నారు.

సామర్లకోట స్థానిక 6వ వార్డులో జగ్జీవన్‌ రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి పెద్దాపురం నియోజకవర్గ అభ్యర్థి దవులూరి దొరబాబు పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గంగిరెడ్డి అరుణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌లు ఉబా జాన్‌ మోజెస్‌, గోకిన సునెత్రదేవి, వైసిపి నాయకులు దవులూరి సుబ్బా రావు, గొరకపూడి చిన్నయ్యదొర పాల్గొన్నారు. అలాగే మండలంలోని వేట్లపాలెం గ్రామంలో జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాన్ని టిడిపి నాయకులు గుణ్ణం చంద్రమౌళి, గుణ్ణం రిత్విక్‌ ఆవిష్కరించారు.

యు.కొత్తపల్లి మండలంలో పలు గ్రామాల్లో జగజ్జీవన్‌ రామ్‌ జయంతిని నిర్వహించారు. ఎంఆర్‌పిఎస్‌ మండల అధ్యక్షులు మోర్త రవి మాదిగ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ కార్యక్రమంలో ఎంఇఎఫ్‌ జిల్లా నాయకులు సిద్ధాం తపు బెన్‌జాన్సన్‌ పాల్గొన్నారు.

ఏళేశ్వరం స్థానిక పెద్దవీధి ఎస్‌సి ప్రాంతంలో వైసిపి అభ్యర్థి వరుపుల సుబ్బారావు, స్థానిక మెయిన్‌ రోడ్‌లో ఎంఆర్‌ పిఎస్‌ అధ్యక్షుడు అనంత రపు రాజు, ప్రత్తిపాడు కోర్టు ఆవరణలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు మళ్ల గంగాధర్‌ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాకాడ నాగేశ్వరరావు, దామర్‌సింగ్‌ కన్నా రావు, పలివెల నూకరాజు పాల్గొన్నారు.

కరప టిడిపి ఎస్‌సి సెల్‌ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చాట్ర ఇమ్మాను యేలు ఆధ్వర్యంలో జగ్జీవన్‌ రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఉందూర్తి ప్రకాశ రావు, సవరపు సత్తిబాబు, దార్ల శ్రీను, రాయి చిన్నా పాల్గొన్నారు.

పెద్దాపురం పట్టణంతోపాటు, మండల పరిధిలోని పలు గ్రామాల్లో జగ్జీవన్‌ రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. డివిజనల్‌ రెవెన్యూ కార్యాలయంలో ఆర్‌డిఒ జె.సీతారామారావు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక కొండయ్య పేటలో మున్సిపల్‌ కౌన్సిలర్లు త్సలికి సత్య భాస్కరరావు, కట్టా రాజ బాబుల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కాకినాడ రూరల్‌ బోటు క్లబ్‌ వాకర్స్‌ సంఘం ఆధ్వ ర్యంలో బాబు జగజ్జీవన్‌ రామ్‌ జయంతిని నిర్వహించారు. ఈ కార్య క్రమంలో రత్న ప్రసాద్‌, రాజా, సత్యనారాయణ చౌదరి పాల్గొన్నారు.

➡️