చల్ల చల్లగా పుచ్చకాయ్…

Apr 6,2024 12:07 #Kakinada

ప్రజాశక్తి-తాళ్లరేవు: అసలే వేసవి తాపం, ఎన్నికల హడావిడి, ప్రచారాలు జోరుగా సాగుతుండడంతో ఆయా పార్టీల కార్యకర్తలు ఎండ వేడిమిని తట్టుకోలేక హీటెక్కిపోతున్నారు. దీన్ని గమనించిన ఓ నాయకుడు కార్యకర్తలందరికీ చల్లచల్లగా పుచ్చకాయ ముక్కలు కోసి ఇచ్చి అందరినీ కూల్ చేశాడు. వైకాపా ప్రచారంలో భాగంగా పొన్నాడ సతీష్ కుమార్, పితాని బాలకృష్ణ పటవల వచ్చిన సందర్భంగా స్థానిక వైకాపా నాయకుడు కొటికలపూడి చంద్రశేఖర్(చందు) సుమారు 60 కేజీల పుచ్చకాయలు తెచ్చి అందరికీ ముక్కలు కోసి అందించాడు. దీంతోపాటు మజ్జిగ, కూల్ డ్రింక్స్ అందించడంతోఎండ వేడిమి నుంచి కార్యకర్తలు చల్లబడ్డారు.

➡️