తునిలో ముగిసిన ఎన్నికలు

May 13,2024 23:29
తుని నియోజకవర్గంలో

ప్రజాశక్తి – కోటనందూరు

తుని నియోజకవర్గంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. కోటనందూరు, తుని, తొండంగి మండలాల పరిధిలో2,24,538 మంది ఓటర్లు ఉండగా 223 పోలింగ్‌ కేంద్రా లను ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుంచి ఓటర్లు ఓటు వేయడం కోసం బారులు తీశారు. కొన్ని చోట్ల ఇవిఎం మోరాయించడంతో ఓటింగ్‌ ఆలస్యంగా జరిగింది. వైసిపి అభ్యర్థి మంత్రి దాడిశెట్టి రాజా తన కుటుంబ సభ్యులతో తమ స్వగ్రామమైన ఎస్‌.అన్నవరం గ్రామంలో ఓటు హక్కును వినియోగిం చుకున్నారు. టిడిపి అభ్యర్థి యనమల దివ్య, టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు కుటుంబ సభ్యులతో కలిపి తమ స్వగ్రామమైన ఎవి నగరం గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హంస వరము, అల్లిపూడి, ఇందుకపల్లి గ్రామాల్లో వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య వివాదం రాయ డంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సముదా యించారు. మంత్రి రాజా తుని పట్టణంలో జరుగుతున్న పోలింగ్‌ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రాజా మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి జెండా రెపరెపలాడు తుందన్నారు. రాత్రి 9 గంటల వరకు అల్లిపూడి, ఇందుకుపల్లి, హంసవరం గ్రామాల్లో పోలింగ్‌ కొనసాగుతుంది. నియోజకవర్గంలో 68.09 శాతం పోలింగ్‌ నమోదు అయ్యిందనిఎన్నికల రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.

➡️