స్ట్రాంగ్‌రూమ్‌కు ఇవిఎం, వివిప్యాట్‌లు

Apr 16,2024 23:14
కాకినాడ సిటీ నియోజక

ప్రజాశక్తి – కాకినాడ

కాకినాడ సిటీ నియోజక వర్గానికి సంబంధించిన ఇవిఎం, వివి ప్యాట్‌లను మంగళవారం మెక్లారిన్‌ స్కూల్‌ ఆవరణలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఉన్న తాత్కాలిక స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించారు. రిటర్నింగ్‌ అధికారి జె.వెంకటరావు పర్య వేక్షణలో వివిధ రాజకీయ పార్టీల నాయ కుల సమక్షంలో ఇవిఎం, వివిప్యాట్‌లను తాత్కా లిక స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచి సీల్‌ వేశారు. సిటీ నియోజకవర్గానికి సంబం ధించి 281 కంట్రోల్‌ యూనిట్లు, 281 బ్యా లెట్‌ యూనిట్లు, సుమారు 305 వివి ప్యా ట్‌లు ఇక్కడకు కేటాయించారు. ఇదే సంఖ్య పార్లమెంట్‌ అభ్యర్థికి సంబంధించి కూడా వచ్చినట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ గుం టూరు శేఖర్‌, ఎఆర్‌ఒ చల్లన్నదొర, డిప్యూటీ తహశీల్దార్లు నాయుడు, సిహెచ్‌ అనిల్‌ కుమార్‌, పవన్‌, ఆర్‌ఐ దీపక్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

పరిశీలకుల వసతి ఏర్పాట్లు

పరిశీలనకు త్వరలోనే కేంద్ర పరిశీలకులు ఇక్కడకు రానున్నారని రిటర్నింగ్‌ అధికారి జె.వెంకటరావు తెలిపారు. వీరు బస చేసేందుకు రామ్‌కోస భవనంలో వసతి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి అక్కడ కల్పిస్తున్న సదుపా యాలను, వసతి ఏర్పాట్లను ఆయన పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చా రు. ఆయన వెంట నగరపాలక సంస్థ ఎస్‌ఇ పి.సత్యకుమారి, ఎఇ రమేష్‌ పాల్గొన్నారు.

ముగిసిన శిక్షణ

కాకినాడ పిఆర్‌ ప్రభుత్వ కళాశాల ఆవరణలో అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్స్‌(ఒపిఒ)లకు ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. రెండు రోజుల్లో దాదాపు 2,4 00 ఒపిఒలకు శిక్షణ ఇచ్చారు. సిటీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి జె.వెంకట రావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి విధులపై ఒపిఒలకు సూచనలు ఇచ్చారు.

➡️