అరకొరగానే ‘స్టూడెంట్‌ కిట్లు’

Jun 16,2024 23:04
వైసిపి ప్రభుత్వం మారి టిడిపి

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

వైసిపి ప్రభుత్వం మారి టిడిపి అధికారంలోకి రావడంతో ‘విద్యా కానుక’ పేరును అధికారులు స్టూడెంట్‌ కిట్లుగా మార్పు చేసి అందిస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమై రెండు రోజులు గడుస్తున్నా నేటికీ పూర్తిస్థాయిలో ఇవి ఇంకా జిల్లాకు చేరుకోలేదు. పాఠ్యపుస్తకాలు, ష్యూలు మాత్రమే అరకొరగా వచ్చాయి. యూనిఫామ్‌, బెల్టులు, బ్యాగులు, డిక్షనరీలు ఒక్కటి కూడా చేరుకోలేదు.వేసవి సెలవులు ముగియడంతో ఈనెల 12 నుంచి పాఠశాలలు పున్ణప్రారంభం కావాల్సి ఉండగా సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండడంతో 13 నుంచి పాఠశాలలు తెరిచారు. తెరిచిన రోజునే స్టూడెంట్‌ కిట్లను పూర్తిస్థాయిలో పంపిణీ చేయాల్సి ఉన్నా అధికారుల నిర్ల క్ష్యంతో జాప్యం జరుగుతోంది. కాకినాడ జిల్లాలో 933 ప్రాథమిక, 99 ప్రాథమి కోన్నత, 253 ఉన్నత పాఠశాలున్నాయి. ఈ పాఠశాలల్లో 1,49,856 మంది విద్యా ర్థులు చదువుతున్నారు. స్టూడెంట్‌ కిట్లో నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, బెల్ట్‌, ఒక జత ష్యూలు, రెండు జతల సాక్స్‌, డిక్ష నరీ, మూడు జతల యూనిఫామ్‌, బ్యాగు ఇస్తున్నారు. కుట్టిం చుకునేందుకు కుట్టికూలీ ఇస్తారు. వేసవి సెలవు ల్లోనే ఈ కిట్లను పాఠశాలలు తెరిచే రోజునే విద్యా ర్థులకు పంపిణీ చేస్తారు. అందుకు తగ్గట్టుగా ఎస్‌ఎస్‌ఎ అధికారులు అన్ని పాఠశాలలకు వీటిని అందివ్వాలి. కానీ ఆచరణలో పూర్తిస్థాయిలో సామాగ్రి చేరుకోలేదు.

పూర్తి స్థాయిలో కిట్లు ఏవీ.?

జిల్లాలో 1 నుంచి 10వ తరగతి వరకు 1.49 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరందరికి కలిపి 12,34,513 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా ఇప్పటి వరకు 10,34,242 మాత్రమే వచ్చాయి. ఇంకా 2,00,271 పుస్తకాలు రావాల్సి ఉంది. 9,45,256 నోటు పుస్తకాలు మాత్రం పూర్తిస్థాయిలో చేరుకున్నాయి. పలు మండలాల్లో పాఠశాలలకు పూర్తిస్థాయిలో పుస్తకాలు చేరుకోలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యా కానుక కిట్లు పూర్తి స్థాయిలో చేరుకోని పరిస్థితి నెలకొంది. పాఠశాలలు ప్రారంభం నాటికే అన్ని వస్తువులు పూర్తిస్థాయిలో పుస్తకాలు అందజేస్తామని విద్యాశాఖ అధి కారులు ఏటా చెబుతున్నా ఆచరణలో విఫలమవు తున్నారు. ఈ ఏడాది ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు చేరేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే కిట్లలో వస్తువులన్నీ నాణ్యతతో అందివ్వాలని పలువురు కోరుతున్నారు.

➡️