‘కార్మికులను భయపెట్టడం మానుకోవాలి’

Jun 16,2024 23:05
సామర్లకోట రాక్‌ సిరామిక్స్‌

ప్రజాశక్తి – సామర్లకోట

సామర్లకోట రాక్‌ సిరామిక్స్‌ యాజమా న్యం కార్మికులను చర్చల పేరుతో పిలిచి బెదిరింపు లకు పాల్పడడం మానుకో వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి డి.క్రాంతికుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆది వారం రాక్‌ సిరామిక్స్‌ కంపెనీ గేటు ముందు 7వ రోజు కార్మికులు నిరసన కొనసాగించారు. ఈ నిరసనలో ఆయన మాట్లాడుతూ రాక్‌ యాజమాన్యం కార్మికులను చర్చల పేరుతో కొంత మంది కార్మికులను పిలిచిందని కానీ సమస్యపై మాట్లాడడం మానేసి కార్మికులను బెదిరించడం ప్రారంభించిందన్నారు. పోలీసులు లాఠీచార్జీ చేస్తారని, గేటు ముందు ధర్నా చేయడం కుదరదని హెచ్చరించారని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్‌ను పరిష్కరించాల్సిన యాజమాన్యం ఈ రీతిలో కార్మికులను బెదిరింపులకు గురిచేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం తన మొండి వైఖరిని విడనాడి తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్య క్రమంలో చంద్రశేఖర్‌, సతీష్‌, రామకృష్ణ, వర ప్రసాద్‌, మల్లికార్జునరావు, గంగాధర్‌, క్రాంతి, మంగారావు, అర్జున్‌రావు, మూర్తి, సత్యనారా యణ, చంద్రన్న, ప్రభుదాస్‌, రామచంద్రయ్య, రాజబాబు, సతీష్‌కుమార్‌, శివనారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గోన్నారు.

➡️