అన్ని నియోజకవర్గాల్లోనూ జెబిఆర్‌బి పార్టీ పోటీ

Apr 13,2024 22:02
రాబోయే ఎన్ని కల్లో జై

ప్రజాశక్తి – కాకినాడ

రాబోయే ఎన్ని కల్లో జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ(జెబిఆర్‌బి) జిల్లాలోని 7 అసెంబ్లీ, ఒక పార్లమెం టు స్థానంలోనూ పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గారపు మల్లి ఖార్జున తెలిపారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రి కేయుల సమావేశంలో ఆయన మాట్లా డారు. వైసిపి ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కాకినాడ స్మార్ట్‌ సిటీని అవినీతికి అడ్డాగా మార్చేశారని దుయ్యబట్టారు. నగరంలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. ప్రజలకు మెరుగైన పాలన రావాలంటే జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ అధికారం లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. కాకినాడ అర్బన్‌ నుంచి న్యాయవాది గింజాల చక్రవర్తి పోటీ చేస్తారని ప్రకటించారు. చక్రవర్తి మాట్లాడుతూ కాకినాడ నగరంలో అవినీతి రహిత పాలన సాగించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి జి.హరీష్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️