19న జ్యోతుల నామినేషన్‌ దాఖలు

Apr 17,2024 22:42
టిడిపి జగ్గంపేట

ప్రజాశక్తి – జగ్గంపేట

టిడిపి జగ్గంపేట నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఈ నెల 19న నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు. బుధవారం మండలంలోని ఇర్రీపాక గ్రామంలో ఆయన శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల ఆశీర్వాదం నిమిత్తం నామినేషన్‌, ముహూర్త పత్రాలను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీ ఉదయం 10:30కు బయలుదేరి వెళ్లి 11.19 గంటలకు నామినేషన్‌ వేయడం జరుగుతుందని తెలిపారు. కావున టిడిపి, జనసేన, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

➡️