విభజన హామీలు కాంగ్రెస్‌తోనే సాధ్యం

Apr 29,2024 23:09
రాష్ట్ర విభజన హా మీలు

ప్రజాశక్తి – ఏలేశ్వరం

రాష్ట్ర విభజన హా మీలు అమలు కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్‌ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి నీరుకొండ సత్యనారాయణ అన్నా రు. సోమవారం మండలం లోని ఎర్రవరం గ్రామంలో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ వైసిపి ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కు పోయిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మొయ్యేటి సూర్యప్రకాశరావు, కొప్పన కోటేశ్వరరావు, కరణం శ్రీనివాస్‌, మొయ్యేటి నారాయణ, తాతపూడి జార్జి రాజు కార్యకర్తలు ఉన్నారు.

➡️