చిత్తడి నేలల సంరక్షణ ప్రతి ఒక్కరిది 

Jan 24,2024 14:57 #Kakinada
Protecting wetlands is everyones duty

ప్రజాశక్తి-తాళ్లరేవు : ప్రకృతి విపత్తుల నుంచి మనలను కాపాడటానికి చిత్తడి నేలలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ జీవవైవిద్య నిపుణుడు కోక మృత్యుంజయరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. తాళ్లరేవు మండలం చొల్లంగిలో కోరంగి పర్యాటక కేంద్రంలో ఎపి నేషనల్ గ్రీన్ కోర్, ఎపి స్కూల్ ఎడ్యుకేషన్, అటవీశాఖ సంయుక్తంగా చిత్తడి నేలల సంరక్షణపై అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు మృత్యుంజయరావు అవగాహన కల్పించారు. చిత్తడి నేలల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏ పీ గ్రీన్ కోర్ స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కే.గోవిందరావు, రీజనల్ కోఆర్డినేటర్ కేసరి శ్రీనివాస్, జిల్లా కోఆర్డినేటర్ కెవికె మహేశ్వరరావు, అటవీ శాఖ అధికారి మహేష్, సిబ్బంది భైరవమూర్తి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

➡️