8న ‘సంఘం శరణం గచ్ఛామి’

Apr 7,2024 23:06
ఈ నెల 8వ తేదీ సాయంత్రం

ప్రజాశక్తి – కాకినాడ

ఈ నెల 8వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు నగరంలోని సూర్యకళామందిరంలో ‘సంఘం శరణం గచ్ఛామి’ నృత్య రూప నాటక ప్రదర్శన ఉంటుందని యుటిఎఫ్‌ రాష్ట్ర పూర్వపు కార్యదర్శి జి.ప్రభాకర వర్మ తెలిపారు. ఆదివారం స్థానిక యుటిఎఫ్‌ హోమ్‌లో ఇందుకు సంబంధించి కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ బిఆర్‌.అంబేడ్కర్‌ జీవితం-కృషిని వివరిస్తూ హైదరాబాద్‌ అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ రూపొందించిన ‘సంఘం- శరణం -గచ్ఛామి’ నృత్యరూప నాటక ప్రదర్శనను అంబేద్కర్‌ 133వ జయంతి సందర్భంగా సిఐటియు, యుటిఎఫ్‌, జెవివి, కెవిపిఎస్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, డివైఎఫ్‌ఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ రూపొం దించిన ఈ నాటకం 500పైగా ప్రదర్శనలు జరిగా యన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ నాటకాన్ని నగర ప్రజలు తిలకించాలని కోరారు. సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీర బాబు మాట్లాడుతూ అంబేడ్కర్‌ కొందరివాడు కాదు అందరివాడని చాటి చెప్పడానికే ఈ నాటకం ప్రదర్శిం చడం జరుగు తుందన్నారు. అంబేద్కర్‌ కృషి, ఆయన ఆశయాలు, ఆలోచనలు ఎంత విస్తృతంగా ఉన్నాయో ఈ నాటకం చూస్తే రేఖామాత్రంగా అర్థం అవుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్‌.గోవిం దరాజులు, వివి.రమణ, పాములయ్య, కె.నాగ జ్యోతి, మలక వెంకటరమణ పాల్గొన్నారు.

➡️