నేడు ‘సంఘం శరణం గచ్చామి’ నాటిక ప్రదర్శన

Apr 10,2024 23:41
మండలంలోని మల్లాం

ప్రజాశక్తి – పిఠాపురం

మండలంలోని మల్లాం గ్రామంలో గురువారం ‘సంఘం – శరణం- గచ్చామి’ నృత్య రూపక నాటిక ప్రదర్శన ఉంటుందని ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. బుధ వారం ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ 134వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ రూపొందించిన ఈ నాటికను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌), అంబేడ్కర్‌ యువజన సంఘం, అంబేడ్కర్‌ వ్యవసాయ కూలి సంఘం, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరుగుతుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రదర్శిం చబోయే ఈ నాటకాన్ని గురువారం సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని, గ్రామ ప్రజలు తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి.సూరిబాబు, కె.సింహాచలం, జి.లోవబాబు, కె.కృష్ణారావు, కె.లచ్చబాబు, డి.సత్తిబాబు, పి.చిన్ని, కె.లోవరాజు, డి దుర్గారావు, డి.శ్రీను, బి.నాగచక్రం పాల్గొన్నారు.

➡️