ఎన్నికల విధులపై ఒపిఒలకు శిక్షణ

Apr 15,2024 23:11
పోలింగ్‌ రోజున విధులు

ప్రజాశక్తి – కాకినాడ

పోలింగ్‌ రోజున విధులు నిర్వర్తించే ఒపిఒలకు సోమవారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక పిఆర్‌ ప్రభుత్వ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. రెండు రోజులు పాటు జరిగే శిక్షణలో దాదాపు 2400 మంది ఒపిఒలకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతిరోజు నాలుగు బ్యాచ్‌లుగా విభజించి ఈ శిక్షణ ఇస్తున్నారు. సుమారు 31 మంది మాస్టర్‌ ట్రైనర్లు వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా చేపట్టాల్సిన విధులు, సాంకేతికపరమైన, చట్టపరమైన అంశాలు, ఇవిఎం, వివి ప్యాట్‌ల నిర్వహణ తదితర అంశాలపై వారికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ నియోజకవర్గ ఆర్‌ఒ జె.వెంకటరావు మాట్లాడుతూ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో ఇటువంటి శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. శిక్షణా కార్యక్రమాలను అవగాహన చేసుకుని ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో ఒపిఒలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఆర్‌ఒ చెల్లన్న దొర, ఇతర ఎన్నికల సిబ్బంది ఉన్నారు.

➡️