రెపరెపలాడిన ఎర్రజెండా

May 1,2024 23:51
కాకినాడ జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌

ప్రజాశక్తి – యంత్రాంగం

కాకినాడ జిజిహెచ్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి పాల్గొని సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బేబీరాణి మాట్లాడుతూ 138 ఏళ్ల క్రితం చికాగో నగరంలో కార్మిక వర్గం 8 గంటల పని దినం కోసం పోరాడి సాధించుకుంటే ఆ పోరాటంలో ఎందరో కార్మికులు అమరులయ్యారని అన్నారు. ఆ అమరవీరుల త్యాగాల ఫలితమే ఈ మేడే అని గుర్తు చేశారు. ప్రస్తుతం పాలకులు 8 గంటల పని దినాన్ని మార్పు చేసి 12 గంటలు తీసుకురావాలని చూస్తున్నారని ఇది ఎంత మాత్రం సహించేది కాదన్నారు. దోపీడి ప్రభుత్వాలను కూలదోచేసేందుకు మేడేను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జిజిహెచ్‌లో మెస్‌ వర్కర్లు, మెడికల్‌ ఎంప్లాయిస్‌, క్లాప్‌ వాహన డ్రైవర్స్‌, మున్సిపల్‌ వాహన డ్రైవర్స్‌ సిఐటియు జెండాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమాల్లో సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, రమేష్‌ రవి, ఏడుకొండలు, శంకర్‌, నాయుడు, వాసు, పుష్పరాగం, లక్ష్మి, తదితరులు పాల్గొ న్నారు. అలాగే యుటిఎఫ్‌ హోంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి టి.అన్నారాం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, అసోసియేట్‌ అధ్యక్షురాలు నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, ఐక్య ఉపాధ్యాయ పత్రిక ఎడిటోరియల్‌ బోర్డు సభ్యుడు ఐ.ప్రసాదరావు, జిల్లా కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే కాకినాడ మెడికల్‌ హోల్‌ సేల్‌ అండ్‌ రిటైల్‌ షాప్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనియన్‌ స్థూపం వద్ద జెండాను పౌర సంక్షేమ సంఘం కన్వీనర్‌ దూసర్లపూడి రమణరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిఠా యిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కోలా ఎల్లారావు, ప్రధానకార్యదర్శి పెద్ధింశెట్టి వీర వెంకటసత్యనారాయణ, పెదిరెడ్డి సత్యనారాయణ, వడ్డాది వెంకట సత్య రమణరావు, పోలవరపు అప్పలరాజు, రేగాని వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు. అలాగే సిఐటియు కార్యాలయం వద్ద జరిగిన మేడే దినోత్సవంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.రాజ్‌కుమార్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కాకినాడ కలెక్టరేట్‌ మీదుగా బాల చెరువు సెంటర్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జిల్లా వర్కింగ్‌ కమిటీ సభ్యురాలు ఎన్‌.ఈశ్వరి, ఎపిఎం ఎస్‌ఆర్‌యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.వెంకట్రావు, రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్‌, స్వామి, వర్మ, కొప్పుశెట్టి సత్తిబాబు, పి కుమారస్వామి పాల్గొన్నారు.

కాకినాడ రూరల్‌ ఐడిఎ, అడబాల ట్రస్టు ఆధ్వర్యంలో మేడేను నిర్వహించారు. ఈ సందర్భంగా సభికులకు ఎలక్ట్రాల్‌ పేకిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐడిఎ సిడిహెచ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ అడ్డాల, అడబాల రత్నప్రసాద్‌, నిమ్మకాయల వెంకటేశ్వర రావు, కాకినాడ ఐడిఎ అధ్య్యక్షుడు డాక్టర్‌ నాగేంద్ర, డాక్టర్‌ సిరాజ్‌, డాక్టర్‌ చైతన్య పాల్గొన్నారు.అలాగే ఎపిఐఐసి కాలనీలో జరిగిన మేడే దినోత్సవంలో గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు పాల్గొని మాట్లాడారు. ట్రస్ట్‌ ఛైర్మన్‌ అడబాల రత్న ప్రసాద్‌ సౌజన్యంతో మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.శ్రీనగేష్‌ పాల్గొన్నారు. అలాగే వలసపాకలు, వాకలపూడి, కొవ్వాడ, తమ్మవరం పంచాయతీల్లో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టి నాగేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీను, గణపతి, గంగరాజు, వరలక్ష్మి, వీర వేణి, శ్రీను పాల్గొన్నారు. కాజులూరు స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మేడే దినోత్సవాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు పాల్గొని మాట్లాడారు..ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు కురుపూడి భూచక్రం, అంగన్‌వాడీ కార్యకర్తలు సునీత, ఎస్‌.మంగాదేవి, వై.మంగాదేవి, మహేంద్రవాడ రాధాకుమారి, సత్యవేణి, యానిమేటర్స్‌ అనంతలక్ష్మి, ఎం.పద్మ పాల్గొన్నారు.

ఏలేశ్వరం ప్రత్తిపాడు సిఐటియు ఆధ్వర్యంలో లారీ వర్కర్స్‌ కార్యాలయం వద్ద నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి రొంగల ఈశ్వరరావు, లారీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు కోన నాగేశ్వరరావు, బాబ్జి శివ, అంగన్‌వాడీ సెక్టార్‌ నాయకురాలు అల్లాడి లక్ష్మి, మరియా, అచ్చిరాజు ఆధ్వర్యంలో మేడే దినోత్సవం జరిగింది. అలాగే ఏలేశ్వరంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు, సిఐటియు నాయకులు పిల్ల రాంబాబు, అంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.

కిర్లంపూడి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సిఐటియు, ఎఐటియుసి, సిపిఐ, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షుడు తెలగల జీవ, సిహెచ్‌.రత్నం, పడాల అప్పలరాజు, కాళ్ళ రమణ, పి. సావిత్రి, ఎం. సుభారత్నం, కె.శ్రీదేవి, బి.చక్రలక్ష్మి, బి.సూర్యా ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

పిఠాపురం స్థానిక నండూరి ప్రసాదరావు భవనం నుంచి కార్మికులు మేడే దినోత్సవ ర్యాలీ జరిగింది. బస్టాండ్‌ సెంటర్‌ వద్ద సిఐటియూ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు చిన్న, రమా ప్రభ, ప్రజా సంఘాల నాయకులు విజయ శాంత, కె.రాజు, కె.నాగేశ్వరరావు, విశ్వ నాథం, వీరబాబు, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. అలాగే గొల్లప్రోలులో పాత బస్టాండు సూర్యుడు చెరువ వద్ద మేడేను ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రామిక మహిళ నాయకులు జిల్లా అధ్యక్షురాలు డి పద్మ, శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఎన్‌.ఏసమ్మ, గొల్లప్రోలు మండల సిఐటియు నాయకులు ఒ.నందీశ్వరుడు, సిఐటియు జెండా ఆవిష్కరించారు..ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తులసి, సత్యవతి, వెంకటలక్ష్మి, ప్రభావతి, రమణ పాల్గొ న్నారు. అలాగే మల్లాం గ్రామంలో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు కె సింహాచలం, కె.నాగవెంకట లక్ష్మి, విజయబాబు, చిన్ని,అబ్బాయి, సత్యనారాయణ పాల్గొన్నారు.

యు.కొత్తపల్లి స్థానిక ఊర చెరువు సెంటర్లో మేడే దినోత్సవాన్ని సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎండపల్లి జంక్షన్‌ నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జెండా ను సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు కె.నాగేశ్వరావు, కార్యదర్శి కెవివి.సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.అప్పారెడ్డి, ప్రజా సంఘాల నాయకులు సిహెచ్‌.సాంబ శివకుమార్‌, ఎం.లక్ష్మి, సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.

సామర్లకోట మండల సిఐటియు ఆధ్వర్యంలో పట్టణంలో పలు ప్రాంతాల్లో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక భగత్‌ సింగ్‌ విజ్ఞాన కేంద్రం నుంచి బళ్ల మార్కెట్‌ సెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు కార్యాలయం మండల అధ్యక్షులు బాలం శ్రీనివాస్‌, 29వ వార్డులో ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, ఐఎంఎల్‌ డిపో వద్ద అధ్యక్షులు బుర్రే ఆదినారాయణ, వాటర్‌ ట్యాంక్‌ వద్ద బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి ప్రకృతి ఈశ్వరరావు, భాస్కర్‌ నగర్‌లో కోనా రాంబాబు, 30 వ వార్డులో కరణం శ్రీనివాసరావు, వాటర్‌ ట్యాంక్‌ వద్ద కరణం గోవిందరాజు, లారీ స్టాండ్‌ రోడ్‌ కరణం సత్యనారాయణ, బల్ల మార్కెట్‌ సెంటర్‌ బిల్డింగ్‌ వర్కర్స్‌ అధ్యక్షులు పెనుపోతుల సత్తిబాబు, సంగీత రావు పేట విష్ణు, రిక్షా స్టాండ్‌ చిన్న సిఐటియు జెండాలను ఆవిష్కరించారు. అలాగే ఎఐటియుసి ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో సిపిఐ పట్టణ కార్యదర్శి పెద్దిరెడ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. పెద్దాపురం సిఐటియు ఆధ్వర్యంలో యాసలపు సూర్యారావు భవనం నుంచి మెయిన్‌ రోడ్డు మీదుగా సినిమా సెంటర్‌ వరకూ మే డే ప్రదర్శన నిర్వహిం చారు. యాసలపు సూర్యారావు భవనం వద్ద ప్రయివేట్‌ ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ యూని యన్‌ గౌరవాధ్యక్షులు చింతల సత్యనారాయణ, సినిమా సెంటర్‌లో పాండవ గిరి పెయింటింగ్‌ యూనియన్‌ నాయకులు నీలం శ్రీను, పాసిల వీధిలో తైనాల శ్రీను, ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద టిఎల్‌.పద్మావతి, కొత్తపేటలో గడిగట్ల సత్తిబాబు, మున్సిపల్‌ కార్యాలయం వద్ద వర్రె గిరిబాబు, అలాగే పలుగ్రామాల్లో సిఐటియు జెండాలను పలువురు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రాంతికుమార్‌, సూరి బాబు, శ్రీనివాస్‌, జాగారపు కుమారి, భవాని, అప్పారావు, రామారావు, రమణ, భూసారి శ్రీను, సత్యవతి, కృష్ణ, వీర్రాజు, రాంబాబు, సత్యనారాయణ పాల్గొన్నారు. స్థానిక మెయిన్‌ రోడ్‌లోని ఆంజనేయ స్వామి గుడిసెంటర్లో సిఐటియు మండల నాయకులు దాడి బేబీ అధ్యక్షతన జరిగిన మే డే దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డి.క్రాంతికుమార్‌, గడిగట్ల సత్తిబాబు, చింతల సత్యనారాయణ పాల్గొన్నారు. కళాకారులు వీర్రాజు, కృష్ణ, సత్యనారాయణ, రాంబాబు, నాగు బందం కార్మిక గీతాలు ఆలపించారు.

తాళ్లరేవు మండల సిఐటియు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, స్కీం వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, కొబ్బరి, ఒలుపు దింపు కార్మికులు, పంచాయతీ కార్మికులు మేడే పతాకాలను ఘనంగా ఆవిష్కరించి మేడే ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు, నాయకులు దుప్పి అదృష్టదీపుడు, మందనక్క తణుకురాజు, విప్పర్తి శ్రీనివాసరావు, పులపకూర గోపాలకృష్ణ, వళ్ళు రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.

గండేపల్లి గండేపల్లి గ్రామం లో భవన నిర్మాణ కార్మికుల కార్యాలయం వద్ద అధ్యక్షులు యరకరెడ్డి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన మేడే దినోత్సవంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఇ.చంద్రా వతి పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం అక్కడనుండి జాతి రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల అధ్యక్షులు లలిత దివ్య, అంగన్‌వాడీ అధ్యక్షురాలు రాజేశ్వరి, భవన్‌ నిర్మాణ కార్మికులు నియమాల ధర్మరాజు మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కరప మండల సిఐటియు ఆధ్వర్యంలో పంచాయతీ నుంచి స్థానిక రెవెన్యూ కార్యాలయం వరకూ మేడే దినోత్సవ ర్యాలీ జరిగింది. సిఐటియు మండల అధ్యక్షులు కె సురేష్‌ జెండాను ఆవిష్కరించారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల భవనం వద్దకు జెండాను కార్మికులు నక్కా సత్తిబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీరవేణి, రాంప్రసాద్‌, భవాని, శ్రీపాదం వరలక్ష్మి, ఎం భవాని, నారాయణమ్మ, తది తరులు పాల్గొన్నారు.

కోటనందూరు తుని, కోటనందూరు మండలాల్లో మేడే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తుని పట్టణంలో సిఐటియు మండల కార్యదర్శి నక్కెళ్ళ శ్రీనివాస్‌, కోటనందూరులో సిఐటియు మండల కార్యదర్శి ఎస్‌కె పద్మ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశ, భవన కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రమణమ్మ, లీల, శ్రీదేవి, ఈశ్వరి, అప్పల నరస,పాల్గొన్నారు

➡️