కమలాపురం దక్కేదెవరికో?

కమలాపురం అసెంబ్లీ బరి ఉత్కంఠను కలిగిస్తోంది. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నేను సైతం అంటూ ఇండియా వేదిక తరుపున సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర బరిలో నిలిచారు. వైసిపి తరుపున బరిలో నిలిచిన పి.రవీంధనాధరెడ్డి గెలుపుపై ధీమాగా ముందుకు సాగుతున్నారు. టిడిపి తరుపున యువకుడైన పుత్తా చైతన్యరెడ్డి తొలిసారి బరిలో నిలిచారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ ముందు ఇద్దరు సీనియర్లు టిడిపిని వీడి వైసిపిలో చేరిపోవడం టిడిపి విజయావకాశాలను ఏమాత్రం ప్రభావితం చేసే అవకాశం ఉందనే అంశం చర్చ నీయాంశంగా మారింది.ప్రజాశక్తి – కడప ప్రతినిధి కమలాపురం అసెంబ్లీ ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది. ఇక్కడ 2,04,169 మంది ఓటర్లు ఉన్నారు. కమలాపురం, వల్లూరు, చింత కొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వీరపు నాయునిపల్లి మండలాలు ఉన్నాయి. రెండు దఫాలుగా వైసిపి తరుపున రవీం ద్రనాధరెడ్డి గెలుపొందుతూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలిస్తే హ్యాట్రిక్‌ లభించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. టిడిపి తరుపున సీనియర్‌ నాయకులు పుత్తా నరసి ంహారెడ్డి కుమారుడు పుత్తా చైతన్యరెడ్డి బరిలో నిలిచారు. యు వకుడు ఉత్సాహవంతుడైన చైత న్యరెడ్డి చరిత్రను తిరగరాయాలనే కసితో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆధిక్యత మారేనా!కమలాపురం అసెంబ్లీలో ఆధిక్యత సవాల్‌గా మారింది. కొన్నేళ్లుగా టిడిపికి కమలాపురం, వల్లూరు, చింత కొమ్మదిన్నె మండలాలు, అధికార వైసిపికి చెన్నూరు, పెండ్లిమర్రి, వీరపు నాయు నిపల్లి మండలాల్లో ఆధిక్యాన్ని కలిగి ఉంది. తాజాగా చెన్నూరు మం డలం నుంచి ఫిరాయింపులు పెరగడంతో చెన్నూరు, చింతకొమ్మదిన్నె ఫిప్టీ ఫిఫ్టీ ఓట్లు లభించే అవకాశం ఉంది. టిడిపి, వైసిపి మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయనే చర్చ పెద్దఎత్తున నడుస్తోంది. ప్రతి దఫా ఇటువంటి చర్చ నడుస్తుండడం, పోలింగ్‌, కౌంటింగ్‌ నాటికి పూర్తి వ్యతిరేక ఫలాలు రావడం పరిపాటిగా మారింది. 2019 ఎన్నికలు మినహాయిస్తే కొన్ని దశాబ్దాల ఎన్నికలను పరిశీలిస్తే నాలుగు వేల నుంచి 10 వేలలోపు మెజార్టీతో గెలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్‌ నాయకులు పుత్తా నరసి ంహారెడ్డి బరిలో నిలిచి ఉంటే టిడిపి గెలిచే ఉండేదనే వాదన వినిప ిస్తోంది. నాలుగు దఫాలుగా ఆయన ఓడి పోవడం వల్ల కలిగిన సాను భూతి కలిసొచ్చే అవ కాశం ఉందనే వాదన పెద్దఎత్తున వినిపిస్తోంది.టిడిపిని వీడిన సీనియర్లు ఎన్నికల నోటిఫికేషన్‌ ముంగిట మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, సాయినాథ్‌శర్మ వైసిపిలో చేరడం చర్చ నీయాంశంగా మారింది. పెద్దచెప్పలి, కోగటం ప్రాంతాలకు వీరిద్దరి ప్రభావం పరిమితమైనప్పటికీ రాజకీయంగానే నష్టమనే వాదన వినిపిస్తోంది. వీరిద్దరి కారణంగా పెద్దఎత్తున ఓట్లు పోయే అవకాశాలు లేకున్నా, పొలిటికల్‌ మైండ్‌గేమ్‌ను తలపించిందని మాత్రం చెప్పవచ్చు. పార్టీ ఫిరాయింపుల ప్రభావం ఉండదనీ చెప్పలేం. అతి స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నచోట ప్రతి ఓటూ, పరిణామమూ కీలకమనే సంగతిని గమనించాలి.ఇండియావేదిక ప్రభావంపై మల్లగుల్లాలువైసిపి, టిడిపి అభ్యర్థులకు ధీటుగా ఇండియావేదిక ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. ఇండియా వేదిక అభ్యర్థిగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర శ్రామికజన, మైనార్టీ, బిసి ఓట్లను ప్రభావితం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు అవకాశాలను సవాల్‌ చేస్తున్నతీరు ఆసక్తిని కలిగిస్తోంది. గతంలో అధికార, ప్రతిపక్ష పార్టీల పొత్తుభాగంగా సిపిఐ వీరపునాయునిపల్లి జడ్‌పిటిసి స్థానాన్ని కైవసం చేసుకున్న అనుభవం ఉంది. ఇండియా వేదిక అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నతీరు ఓటర్లను ఆకర్షిస్తోంది. అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి అభ్యర్థుల్లో కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీల కలయికతో కూడిన ఇండియా వేదిక కొల్లగొట్టే ఓట్లు ఎవరి కొంప ముంచుతాయోననే ఆందోళన నెలకొంది.పెద్దచెప్పలి, కోగటం ప్రాంతాలకు వీరిద్దరి ప్రభావం పరిమితమైనప్పటికీ రాజకీయంగానే నష్టమనే వాదన వినిపిస్తోంది. వీరిద్దరి కారణంగా పెద్దఎత్తున ఓట్లు పోయే అవకాశాలు లేకున్నా, పొలిటికల్‌ మైండ్‌గేమ్‌ను తలపించిందని మాత్రం చెప్పవచ్చు. పార్టీ ఫిరాయింపుల ప్రభావం ఉండదనీ చెప్పలేం. అతి స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నచోట ప్రతి ఓటూ, పరిణామమూ కీలకమనే సంగతిని గమనించాలి.

➡️