ఘనంగా కంచర్ల పుట్టినరోజు వేడుకలు

డాక్టర్‌ కంచర్ల అచ్యుతరావు

ప్రజాశక్తి – ఆరిలోవ : సినీ నిర్మాత, ఉపకార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ సీఎండీ, ఎస్‌ఎస్‌ఎల్‌ఎస్‌ క్రియేషన్స్‌ అధినేత, సకల కళాకారుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు, టిడిపి నాయకుడు డాక్టర్‌ కంచర్ల అచ్యుతరావు పుట్టిన రోజు వేడుకలను ఆరిలోవ నెహ్రూనగర్‌లో సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కటింగ్‌, డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌, సినీ సంగీత విభావరి, వివిధ వినోధ సాంస్కతిక ప్రదర్శనలు జరిగాయి. డాక్టర్‌ కంచర్ల పుట్టినరోజు వేడుకల్లో వివిధ సంగీత, జానపద, వంటి సకల కళాకారులు పెద్ద ఎత్తున హాజరై డాక్టర్‌ కంచర్ల కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశార సింహా చలం దేవస్థానం ధర్మకర్త గంట్ల శ్రీనుబాబు పాల్గొని, ఉపకార్‌ ట్రస్ట్‌ సభ్యుడు ధనరాజ్‌ తల్లి వైద్యానికి చేయూతలో భాగంగా ఆటో అందజేశారు.ఉపకార్‌ ట్రస్ట్‌ ఇంఛార్జి సుధీర్‌, కంచర్ల వ్యక్తిగత కార్యదర్శి సిద్ధార్థ, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌ అధ్యక్షుడు పారిపల్లి రామా రావు, విశాఖ గాయకులు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌, విజెఎఫ్‌˜్‌ మాజీ ఉపాధ్యక్షుడు నాగ రాజు పట్నాయక్‌, డొనాల్డ్‌ డక్‌ క్రీడాకారుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు

డాక్టర్‌ కంచర్ల అచ్యుతరావు

➡️