కర్ణాటక మద్యం సీజ్‌ .. వ్యక్తి అరెస్ట్‌

Apr 9,2024 17:28 #Karnataka liquor, #Seizure

ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి : పలమనేరు- కుప్పం జాతీయ రహదారిలోని కైగల్‌ బ్రిడ్జి వద్ద అక్రమంగా తరలిస్తున్న 35 వేల రూపాయల విలువచేసే కర్ణాటక మద్యాన్ని , ఒక ద్విచక్ర వాహనం వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసులకు అందిన సమాచారం మేరకు తన సిబ్బందితో మంగళవారం కైగల్‌ బ్రిడ్జి హైవేలో వాహనాలు తనిఖీ చేస్తుండగా బైరెడ్డిపల్లి మండలంలోని కుటవలవంక గ్రామానికి చెందిన నటరాజ ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ఆ వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో 864 డేట్రా ప్యాకెట్లు, కర్ణాటక మద్యం పట్టుబడ్డాయి. వాటివిలువ సుమారు 35 వేల రూపాయలుగా గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌ కు తరలించినట్లు స్థానిక ఎస్సై కృష్ణయ్య తెలిపారు.

➡️