సమస్యల్లేని నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయం : కోలగట్ల

Apr 18,2024 21:20

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : నగరంలోని వేణుగోపాలపురంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ వైసిపి అభ్యర్థి, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి పాల్గొన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివద్ధి చేసి సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేతత్వంలో సుపరిపాలన సాగిందన్నారు. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు చేరాయని చెప్పారు. ఎన్నికల ప్రచారాన్ని ఉద్దేశించి డివిజన్‌ మేయర్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ కోలగట్ల వీరభద్ర స్వామి గత 5 ఏళ్ళుగా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకున్నారన్నారు. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ ముచ్చులయా యాదవ్‌, వైసిపి నాయకులు ఎస్‌వివి రాజేష్‌, ముచ్చు శ్రీనివాసరావు తదితరులు పాల్గన్నారు.

➡️