ఈదురుగాలులు.. భారీ వర్షం

Mar 20,2024 23:45

మండపేటలో కురుస్తున్న వర్షం

ప్రజాశక్తి-యంత్రాంగం

ద్రోణి ప్రభావంతో బుధవారం డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతోకూడిన వర్షాలు కురిశాయి. గత కొద్ది రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటోంది. అకాల వర్షంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మండపేట మండపేట పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం గాలి వాన కురిసింది. గత కొద్ది రోజులు నుంచి ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు వర్షంతో సేదతీరారు. అయితే కొద్ది రోజుల్లో పంట చేతికి రామన్న నేపథ్యంలో వర్షం కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షం మరింతగా కురిస్తే పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు రైతులు నష్టపోయే అవకాశంలో ఉన్నాయని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా మండలంలో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్‌ సురేష్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. రామచంద్రపురం ద్రోణి ప్రభావంతో బుధవారం మధ్యాహ్నం నుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీనితో జనజీవనం స్తంభించింది. వర్షం కారణంగా పట్నంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు దాళ్వా వరిచేలన్ని ఈయనకు దశలో ఉండగా భారీ వర్షాలతో ఈదురుగాలులతో నష్టం వాటిలో ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు సామాన్యులు ఇక్కట్లకు గురయ్యారు. వర్షాలు వల్ల చిరు వ్యాపారులు అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజులపాటు వర్షాలు ఈదురుగాళ్లు ఇరుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

➡️