ఉద్యోగుల హక్కులను ప్రభుత్వం కాపాడాలి

Jan 27,2024 00:03

మాట్లాడుతున్న కె.కృష్ణవేణ

ప్రజాశక్తి -మామిడికుదురు

ప్రభుత్వం ఎటు వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ఉద్యోగుల హక్కులు కాపాడాలని అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. కృష్ణ వేణి కోరారు. మామిడికుదురు ఎస్‌ సి. కమ్యూనిస్ట్‌ హాలు లో శుక్రవారం మండల శాఖ అధ్యక్షురాలు ఎన్‌. అన్నపూర్ణ అధ్యక్షతన విజయోత్సవ సభ జరిగింది. సమ్మెకు సంఘీభావం తెలిపిన ప్రజాసంఘలకు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు, సర్పంచ్‌లకు, ప్రజలకు అంగన్‌వాడీలు ధన్యవాదాలు తెలిపారు. అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు బండి వెంకటలక్ష్మి మాట్లాడుతూ సమస్యలు హామీలు అమలుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమం లో ఐద్వా మండల అధ్యక్షురాలు వరలక్ష్మి, జి.సూర్య కాంతం, కెవి.లక్ష్మి, డివి.సరోజినీ, యుటిఎఫ్‌ నాయకులు కుడిపూడి సత్యనారాయణ, ఉపాధ్యాయులు బత్తుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 

➡️