ఎన్నికల నియమావళిపై అవగాహన

Mar 19,2024 23:23

సమావేశంలో పాల్గొన్న సిఇఓ శ్రీరామచంద్రమూర్తి

ప్రజాశక్తి-అంబాజీపేట

అంబాజీపేట మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో ఇంచార్జ్‌ ఎంపిడిఒ లక్ష్మి అధ్యక్షతన మంగళవారం విఆర్‌ఒలకు అవగాహనా కార్యక్రమం జరిగింది. ఇఆర్‌ఒ, జెడ్‌పి సిఇఒ ఎ.శ్రీరామచంద్రమూర్తి పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ బాధ్యతతో అమలు చేయాలన్నారు ఎన్నికల కోడ్‌ లో భాగంగా ఫ్లెక్సీలు తొలగింపు, విగ్రహాలపై క్లాత్‌తో కట్టడాలు, పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. రాజకీయ నాయకులు గ్రామాల్లో డబ్బులు పంపిణీ వంటి జరిగితే వెంటనే పూర్తిస్థాయి సమాచారం గంటన్నర సమయంలో ఇసికి తెలియపరచాలన్నారు. ఎన్నికల కోడ్‌ నిబంధనలు పాటిస్తూ విధులను నిర్వహి ంచాలని అన్నారు. ఈ కార్య క్రమంలో తహ శీల్దార్‌ ఎ.విమల కుమారి, డిటి పి.నాగ పద్మలత, ఆర్‌ఐ ఇబ్ర హీం, విఆర్‌ఒలు, బిఎలఒలు పాల్గొ న్నారు.

 

➡️